
Do not add tomatoes to these curries
Tomatoes : మన ఇంటి వంటల్లో Home cooking టమాటా లేనిదే కూర పూర్తయినట్టు అనిపించదు. కూర, పప్పు, గ్రేవీ, నాన్‌వెజ్ ఏదైనా సరే టమాటా తప్పనిసరి అన్న భావన చాలా మందిలో ఉంది. కానీ నిజానికి కొన్ని కూరగాయలకు టమాటా అస్సలు సరిపోదు. పొరపాటున కూడా టమాటా Tomatoe వేస్తే ఆ కూర రుచి మాత్రమే కాదు మొత్తం వంట స్వరూపమే మారిపోతుంది. మరి టమాటాను ఎందుకు దూరంగా పెట్టాలో ఏ కూరల్లో వేయకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Tomatoes : టమాటాలను ఈ కూరల్లో ఎందుకు వేయొద్దు?….కారణం తెలిస్తే ఆశ్చర్యమే..!
బెండకాయలో Ladies Fingers సహజంగా ఉండే జిగురు లక్షణం టమాటాలోని తేమతో కలిస్తే కూర అతిగా జిగటగా మారుతుంది. క్రిస్పీగా పొడిపొడిగా ఉండాల్సిన బెండకాయ వేపుడు తినలేనంతగా మారిపోతుంది. అందుకే బెండకాయ కూరల్లో టమాటా పూర్తిగా మానేయడం మంచిది. పులుపు కావాలంటే చివర్‌లో కాస్త నిమ్మరసం లేదా ఆమ్చూర్ పొడి చాలు. కాకరకాయకు దాని చేదు రుచే ప్రత్యేకత. ఆ చేదుతో పాటు టమాటా పులుపు కలిస్తే రుచి అసహ్యంగా మారే అవకాశం ఉంది. ఇక పాల గుమ్మడికాయ విషయానికి వస్తే దానిలో సహజమైన తీపి ఉంటుంది. టమాటా వేసిన వెంటనే ఆ తీపి పూర్తిగా కనుమరుగై కూర అనవసరంగా పుల్లగా మారుతుంది.
మజ్జిగ పులుసు, కడి, పెరుగుతో curd చేసే స్పెషల్ గ్రేవీల్లో ఇప్పటికే పులుపు ఉంటుంది. ఈ వంటల్లో మళ్లీ టమాటా కలిపితే పులుపు మోతాదు మించిపోతుంది. ఫలితంగా కూర తినడానికి ఇబ్బందిగా మారడమే కాకుండా జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశముంటుంది. పెరుగు ప్రధానంగా ఉండే వంటల్లో టమాటా వాడకాన్ని పూర్తిగా నివారించడమే ఆరోగ్యానికి మంచిది. ఈ వంటల్లో రుచిని పెంచాలంటే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వంటి పదార్థాలు చాలు.
తెల్ల బఠానీలు, శనగలు, అలసందలు వంటి పప్పు దినుసులకు ఒక ప్రత్యేకమైన వాసన, రుచి ఉంటుంది. కానీ వీటిలో టమాటాలు ఎక్కువగా వేస్తే ఆ సహజ రుచి పూర్తిగా కనుమరుగై టమాటా రుచి ఆధిపత్యం చెలాయిస్తుంది. మసాలాల ఘాటు, పప్పుల సువాసనను సహాజంగా ఆస్వాదించాలంటే టమాటా పరిమాణాన్ని తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి.
ప్రతి వంటలో పులుపు కోసం టమాటానే వాడాలనే నియమం లేదు. వంటకాన్ని బట్టి చింతపండు, నిమ్మరసం, పెరుగు లేదా ఆమ్చూర్ పొడిని ఉపయోగిస్తే ఆయా కూరగాయల అసలు రుచి నిలిచిపోతుంది. చిన్న మార్పులతో వంట రుచి రెట్టింపు చేయొచ్చు. ఇకపై కూర చేసేటప్పుడు టమాటా వేయేముందు ఒక్కసారి ఆలోచిస్తే చాలు మీ వంటకు కొత్త రుచి తప్పకుండా దొరుకుతుంది.
Aadabidda Nidhi Scheme : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'సక్సెస్' అనే పదానికి పర్యాయపదంగా మారారు దర్శకుడు అనిల్ రావిపూడి. అపజయమెరుగని దర్శకుడిగా పదేళ్ల ప్రస్థానాన్ని…
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కోట్లాది మంది వేతన జీవులకు తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. పిఎఫ్ ఖాతాల్లో…
No Cost EMI : ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫారమ్లలో మనకు తరచుగా వినిపించే ఆకర్షణీయమైన పదం 'నో కాస్ట్ ఇఎంఐ'…
Ex Lover : భర్త మహాశయులకు విజ్ఞప్తి..రోజు రోజుకు అక్రమ సంబంధాల కారణంగా భార్యల చేతుల్లో భర్తలు హతం అవుతున్నారు.…
Today Gold Rate : ఒకప్పుడు బంగారం ధరలు మాత్రమే పరుగులు పెట్టేది..కానీ ఇప్పుడు చైనా పుణ్యమా అని వెండి…
Lemongrass : ఒకప్పుడు ఇంటి చుట్టూ పెరిగే సాధారణ గడ్డిలా grass కనిపించిన నిమ్మగడ్డి (లెమన్ గ్రాస్) ఇప్పుడు ఆరోగ్య…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
This website uses cookies.