Home » Health » Do You Know How Dangerous The Rice You Eat Every Day Is Shocking Facts From Research
Health

Cancer : ప్రతిరోజు మీరు లొట్టలేసుకొని తినే… అన్నంతో ఎంత ప్రమాదమో తెలుసా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 27, 2025, 12:05 pm
Advertisement

Cancer : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా రోజువారి దినచర్యలో అన్నం తినడం సర్వసాధారణం. అన్నం తినకపోతే బ్రతకలేం. కొందరు అయితే,రోజుకి మూడు పూటలా అన్నమే తింటారు. అయితే నిపుణులు, ఈరోజు అన్నం తింటే ఆరోగ్యానికి పెను ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది ఒక తాజా పరిశోధనలో రుజువు చేయబడింది. వేగంగా మారిపోతున్న వాతావరణ పరిస్థితులు.ముఖ్యంగా, ఉష్ణోగ్రతలు పెరగడం,గాలిలో కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరగడం. ఇలాంటి అంశాలు మన పంటలపై విపరీత ప్రభావాన్ని చూపుతున్నాయి.ముఖ్యంగా, ఓరి ధాన్యం విష పదార్ధంగా శోషించుకోవడం వలన ఎంతో ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. గ్లోబల్ వైద్య జనరల్ లో వచ్చిన అధ్యయన వివరాల ప్రకారం… 2050 నాటికి ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో ప్రధానంగా తినే అన్నం వల్ల,క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వీటిలో భారత్,చైనా, బంగ్లాదేశ్, నేపాల్, వియత్నం, థాయిలాండ్,ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు,ముందు వరుసలో ఉన్నాయి.ఈ పరిశోధన అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Advertisement

Cancer : ప్రతిరోజు మీరు లొట్టలేసుకొని తినే… అన్నంతో ఎంత ప్రమాదమో తెలుసా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు…?

Cancer అన్నం తింటే కలిగే ప్రమాదం

ఆజా సమాచారం ప్రకారం వాతావరణం లో జరిగే మార్పులు వల్ల నేలలోని మూలకాలు మారిపోతున్నాయి ముఖ్యంగా ఆత్సైనిక్ అనే విష పదార్థం స్థాయి పెరుగుతుంది అంటున్నారు అధ్యయనంలో దీనిని వెల్లడించారు. ఆర్సెనిక్ అన్నంలోకి చాలా సులభంగా చేరుతుంది. మట్టిలో ఉండే ఆర్సెనిక్, సాగునీటిలో ఉన్న ఆర్సేనిక్ వలన వరి ధాన్యంలో ఇది ఎక్కువగా నిల్వ ఉంటుంది.వన్డే సమయంలో ఉపయోగించే నీటిలో ఆర్సేనిక్ ఉంటే అది కూడా అన్నంలోకి చేరే అవకాశం ఉంటుంది. శరీరంలో ఆర్సినిక్ చేరితే,ఇది ఊపిరితిత్తులు, మూత్రాశయం, చర్మం లాంటి అవయవాలలో క్యాన్సర్ ఏర్పడే అవకాశం పెరుగుతుంది.ఇది మాత్రమే కాకుండా,గుండె సంబంధిత వ్యాధులు, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ముప్పు కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Advertisement

ఈ సమస్యకు పరిష్కారం : ఈ సమస్యను పరిష్కరించాలంటే.. ముందుగా మట్టి నీటి నాణ్యత పై కఠిన నియంత్రణ అవసరం. అలాగే వరి సాగు విధానాలలో మార్పులు తీసుకురావాలి. ప్రాంతాల వారిగా పర్యావరణ పరిరక్షణ శుద్ధి విధానాలు పాటిస్తే దీన్ని నియంత్రించవచ్చు. వర్షపు నీటి వాడకం,పదార్థాల శుద్ధి, ఆరోగ్యదాయక వంట, నీటి వినియోగం,లాంటి అంశాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలి. మన జీవితంలో విడదీయరాని భాగం. అయితే, మారుతున్న వాతావరణం అన్నంపై చూపే ప్రభావం,మన ఆరోగ్యాన్ని ప్రశ్నార్ధకంగా చేస్తుంది.కాబట్టి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, అన్నం పండించడం,అంటే వరిని పండించడంలో,శుద్ధి చేయడంలో వాడటంలో మార్పులు తీసుకు రావాలి అంటున్నారు నిపుణులు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి