Plastic Bottle : ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Plastic Bottle : ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా….!

 Authored By ramu | The Telugu News | Updated on :7 December 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Plastic Bottle : ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా....!

Plastic Bottle : ప్రస్తుత సమాజంలో ఏది తినాలన్నా , ఏది తాగాలన్న.. భయాందోళనలకు గురి చేస్తుంది. ఎంత ఖరీదైన సరే ఆహార పదార్థాలను కొనుక్కొని మరి అనేక వ్యాధుల బారిన పడిపోతున్నారు ప్రజలు. బయట షాపులలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నీళ్లను కొనుక్కొని ఆ నీళ్లను తాగి మరి రోగాల బారిన పడిపోతున్నారు. ఆరోగ్య నిపుణులు బాటిల్ వాటర్ ని వినియోగించోద్దని హెచ్చరిస్తున్నారు…. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నీ హై రిస్క్ ఫుడ్ కేటగిరీలో చేర్చింది. అయితే ఎఫ్ ఎస్ ఏ ఐ కొత్త నిబంధనలను జారీ చేసింది. ఇప్పుడు బాటిల్ వాటర్ ని విక్రయించే అన్ని కంపెనీలు సంవత్సరానికి ఒకసారి తనిఖీలు చేస్తారు. ప్లాస్టిక్ బాటిల్ వాటర్ నాణ్యతను తనిఖీ చేయడానికి ఈ పని జరుగుతుంది. అయితే ఇది ఇలా ఉండగా… ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ,ఐ రిస్క్ కేటగిరీలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎందుకు చేర్చింది…? దీని వెనుక అసలు నిజం ఏంటి…? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు….? ఈ వివరాలన్నీ తెలుసుకుందాం.

Plastic Bottle ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా

Plastic Bottle : ప్లాస్టిక్ బాటిల్ లో వాటర్ ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా….!

ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ, హై రిస్క్ కేటగిరీలో ప్లాస్టిక్ బాటిల్ వాటర్ ని చేర్చడంపై డాక్టర్ ఏం వలి మాట్లాడుతూ… చాలా కాలం తర్వాత ఈ ముందడుగు వేశామని తెలిపారు…ప్రజలందరూ చాలా కాలం ప్లాస్టిక్ బాటిల్ లో ఉన్న వాటర్ ని తాగడం వలన…. దీని కారణంగా మైక్రో ప్లాస్టిక్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. మైక్రో ప్లాస్టిక్ కూడా ప్రజలు మెదడులోకి ప్రవేశిస్తుంది. ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ ఎలాంటి కొత్త నిబంధనలను రూపొందించిన వెంటనే అమలు చేయాల్సి ఉంటుందని తెలియజేసినారు…

Plastic Bottle వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే….

మైక్రో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లో ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని తెలియజేసినందున కొన్ని పెద్ద హోటల్లు చాలా కాలం క్రితం గాజు సీసాలో నీటిని అందించడం ప్రారంభించాయని డాక్టర్ వలి చెప్పారు. పాతకాలంలో నీళ్లను మట్టి కుండల్లో ఉంచి తాగేవారు. ఇంకా స్టీల్ బిందెలు ఇత్తడి బిందెలు, రాగి బిందెలలో నీళ్లను ఉంచి తాగే వారిని డాక్టర్ వలి చెప్పారు.కానీ ప్రస్తుత సమాజంలో కుండలకి, బిందెలకు బదులు ,ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వచ్చాయి. ఈ బాటిళ్లలో ప్లాస్టిక్ తో పాటు శరీరానికి హాని కలిగించే ఎన్నో ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయన్నారు.

నీళ్లు ప్లాస్టిక్ బాటిల్ లో ఎలా అయితే వస్తున్నాయో.. అలాగే పాలు కూడా ప్లాస్టిక్ బాటిల్ లోనే వస్తున్నాయి.. దీనివల్ల మైక్రో ప్లాస్టిక్ మనిషి శరీరానికి త్వరగా చేరుతుందని డాక్టర్ వలి చెప్పారు మైక్రో ప్లాస్టిక్ శరీరంలోనికి చేరి శరీరానికి హాని కలిగిస్తుందని ఇది ఒక మంచి అడుగు అంటూ ప్రశంసించారు. దీన్ని కచ్చితంగా అమలులో చేయాలన్నారు. ప్లాస్టిక్ బాటిల్ లోని నీళ్లను వినియోగించకుండా, ఇంటిలో ఉన్న వాటర్ ని మరిగించి తాగాలని ప్రజలకు సూచించారు. ఇలా చేయడం వల్ల ఎటువంటి నష్టం ఉండదన్నారు. ఈ మైక్రో ప్లాస్టిక్ వలన అనేక వ్యాధిన బారిన పడుతున్నారు…. ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగకుండా ఆహార పదార్థాలను ప్యాక్ చేసే విధానంపై కూడా శ్రద్ధ పెట్టాలని డాక్టర్ వలి సూచిస్తున్నారు… ఈ మైక్రో ప్లాస్టిక్ ప్రభావం కొంతకాలం తర్వాత తెలుస్తుంది అన్నారు… ఇప్పుడు కూడా ప్రజలు జ్ఞాపకశక్తి బలహీనంగా మారుతుంది..

ఈ మైక్రో ప్లాస్టిక్ అనేక రకాల వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రధాన వ్యాధులకు కారణమవుతుంది. ఆరోగ్యం పై మైక్రో ప్లాస్టిక్ ప్రభావం పై అనేక రకాల పరిశోధనలు కూడా జరిగాయి. ఈ మైక్రో ప్లాస్టిక్ వలన మెదడుకు చాలా హాని కలుగజేస్తుందని అధ్యయనాలలో తెలియజేశారు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది