TEA : టీలో ఉప్ప వేసుకుని తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TEA : టీలో ఉప్ప వేసుకుని తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?

 Authored By ramu | The Telugu News | Updated on :6 May 2024,7:00 am

TEA : మన దేశంలో టీ తాగకుండా మెజార్టీ ప్రజలు ఉండలేరు. ఉదయాన్నే కాసింత టీ తాగకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది. కేవలం ఉదయాన్నే కాదండోయ్.. రోజులో ఏ సమయంలో అయినా సరే టీ తాగడానికి ఇష్టపడుతూనే ఉంటారు. సమయంతో సంబంధం లేకుండా టీ తాగడంలో మన ఇండియన్స్ ముందుంటారు. ఏ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినా సరే టీ తాగడానికి ఇష్టపడుతారు. అంతే కాకుండా కాసింత టైమ్ పాస్ కాకపోయినా సరే టీ తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే అలాంటి టీలో ఎవరైనా షుగర్ వేసుకుంటారు. కానీ ఉప్పు వేసుకుంటే కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది..

బాడీలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఉప్పు బాగా పని చేస్తుంది. దీన్ని టీలో వేసుకుని తాగితే మాత్రం తక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉన్న వారికి కూడా బాగా పెరుగుతుంది.

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా..

టీలో ఉప్పును వేసుకుని తాగితే కలిగే లాభాల్లో ఇది కూడా ఒకటి. ఉప్పు వేసుకుని తాగితే జీర్ణ ప్రక్రియ బాగా మెరుగుపడుతుంది. ఉప్పు జీర్ణ రసాల ఉత్పత్తిని బాగా పెంచుతుంది.

బాడీ హైడ్రేషన్‌ను కాపాడుతుంది

వేసవి కాలంలో బాడీ త్వరగా డీ హైడ్రేట్ కు గురవుతుంది. ఈ సమస్య ఉన్న వారు టీలో ఉప్పు వేసుకుని తాగితే రోజంగా బాడీ హైడ్రేషన్ లోనే ఉంటుంది.

ఎన్నో ఖనిజాలు

ఉప్పులో చాలానే ఖనిజాలు ఉంటాయి. అందులో చూసుకుంటే మెగ్నీషియం, సోడియం, కాల్షియం, పొటాషియం లాంటివి ఉంటాయి. కాబట్టి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

TEA టీలో ఉప్ప వేసుకుని తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా

TEA : టీలో ఉప్ప వేసుకుని తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?

చర్మం ఆరోగ్యంగా..

ఉప్పు వేసిన టీ తాగడం వల్ల బాడీకి జింక్ లభిస్తుంది. దాని వల్ల మన చర్మం ఎక్కడైనా డ్యామేజ్ అయితే అక్కడ కచ్చితంగా రిపేర్ చేస్తుందని చెప్పుకోవాలి. చర్మాన్ని నిత్యం మెరిసేలా చేస్తుంది.

మైగ్రేన్‌ నొప్పి మాయం…

సాల్టెడ్ టీలో ఉండే మరో గొప్ప గుణం ఏంటంటే మైగ్రేన్ నొప్పిని ఈజీగా తగ్గిస్తుంది. మైగ్రేన్ సమస్యలను పూర్తిగా దూరం చేస్తుంది. మీ మనస్సును రిలాక్స్ గా ఉంచడంలో సాయం చేస్తుంది.

చేదును తగ్గిస్తుంది..

టీని ఎక్కువ సేపు మరిగిస్తే కాస్తంత చేదుగాఅనిపిస్తుంది. అలాంటి సమయంలో టీలో కాస్తంత ఉప్పు వేసుకుంటే మాత్రం టేస్ట్ ఇట్టే మారిపోతుంది.

రుచిని మెరుగుపరుస్తుంది..

ఉప్పు గ్రీన్, వైట్ టీ లాంటి టీ రకాలలో ఉప్పు వేసి రుచి ఆటోమేటిక్ గా పెరుగుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది