Coconut Water : కొబ్బరి నీళ్ళ సీక్రెట్ ఏంటో తెలుసా మీకు… అందుకే హీరో, హీరోయిన్లు కొబ్బరినీళ్ళను తాగుతూ ఉంటారు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Coconut Water : కొబ్బరి నీళ్ళ సీక్రెట్ ఏంటో తెలుసా మీకు… అందుకే హీరో, హీరోయిన్లు కొబ్బరినీళ్ళను తాగుతూ ఉంటారు..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :31 January 2023,4:00 pm

Coconut Water ; మనం నీరసంగా ఉన్న లేదా ఏదైనా వ్యాధి బారిన పడినప్పుడు మనం నీరసం తగ్గి శక్తి పొందడానికి కొబ్బరినీళ్లను తాగుతూ ఉంటారు. సహజంగా ఉదయం వాకింగ్కి వెళ్లేటప్పుడు చాలామంది కొబ్బరినీళ్లు తాగుతూ ఉంటారు. కొందరు హీరో హీరోయిన్లు ఫిట్నెస్ కోసం ఆహారంలో కొబ్బరి నీటిని తప్పకుండా ఒక భాగంగా మార్చుకుంటూ ఉంటారు. కొబ్బరినీళ్లు చాలా రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతూ ఉంటాయి. ఆరోగ్యం పై అవగాహన ఉన్నవాళ్లు ముఖ్యంగా కొబ్బరి నీళ్లు తాగడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. కొబ్బరి నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Do you know the secret of coconut water

Do you know the secret of coconut water

అలాగే క్యాలరీలు పిండి పదార్థాలు చక్కెర చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి.కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం… చర్మానికి ఉపయోగకరమైనవి.. కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు చర్మానికి చాలా మేలు చేస్తూ ఉంటాయి. అలాగే మొటిమల సమస్యని తగ్గించడానికి కొబ్బరి నీళ్లు చాలా ఉపయోగపడతాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరిసేలా చేస్తూ ఉంటుంది. తక్కువ కొలెస్ట్రాల్ : కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొబ్బరి నీళ్లు శరీరాన్ని డిటాక్స్ చేస్తూ ఉంటుంది. దీన్ని తాగడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గిపోతాయి..

Do you know the secret of coconut water

Do you know the secret of coconut water

పిత్తాశయ రాళ్ళని కూడా కరిగిస్తాయి… కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రైట్ గా ఉంచుతుంది. అలాగే శరీరాన్ని డీటాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ నీళ్లు తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ అన్నీ బయటకు పోతాయి. ఇది కిడ్నీ స్టోన్ ప్రమాదం నుంచి బయటపడేస్తుంది.. బరువు తగ్గుతారు : బరువు తగ్గడానికి కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. దీనిలో ఉండే బయో యాక్టివ్ ఎంజైమ్ల్ జీవక్రియను పెంచి బరువు తగ్గించడంలో ఉపయోగపడతాయి.

కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల క్యాలరీలు కరిగిపోతాయి. అలాగే ఫిట్నెస్ గా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది : కొబ్బరి నీటిలో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. అధిక రక్తపోటు వ్యాధిగ్రస్తులకు కొబ్బరినీళ్లు తీసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు.. అందుకే నటీనటులు ఎప్పుడు ఫిట్ గా, అందంగా ఉండడం కోసం కొబ్బరి నీళ్లను నిత్యం తీసుకుంటూ ఉంటారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది