Cucumber : రాత్రి టైంలో కీర దోసకాయను తింటే ఏం జరుగుతుందో తెలుసా…!!
ప్రధానాంశాలు:
Cucumber : రాత్రి టైంలో కీర దోసకాయను తింటే ఏం జరుగుతుందో తెలుసా...!!
Cucumber : ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల సమస్యలతో మనం ఇబ్బంది పడుతూ ఉన్నాము. వాటిలలో ఒకటి అధిక బరువు. అయితే బరువు తగ్గాలి అని అనుకునేవారు కచ్చితంగా తీసుకునే ఆహారాలలో కీర దోస కీలకమైనది. ఈ కీర దోసకాయలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిలో విటమిన్ కే మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే శరీరంలో ఇతర రకాల కనిజాల లోపాలను తగ్గించటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే ఇవి ఎంతో ఉపయోగకరం అయినప్పటికీ కూడా వీటిని రాంగ్ టైమ్ లో తింటే హాని కలుగుతుంది. అందుకే పోషకాహార నిపుణులు సాధారణంగా రాత్రి టైంలో కీర దోసకాయను అసలు తినకూడదు అని అంటున్నారు.
రాత్రి టైమ్ లో కీర దోసకాయను తీసుకుంటే జలుబు చేస్తుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ ఆలోచన నిరాధారమైనది. అంతేకానీ రాత్రి టైం లో కీర దోసకాయలను తినకూడదు అని కాదు. వీటిని సరైన మోతాదులో తీసుకుంటే మాత్రం ఎటువంటి హాని జరగదు. అలాగే కీర దోసకాయను రాత్రి టైం లో తినకూడదు అనడానికి ప్రధాన కారణం దీనిలో ఉండే పీచు పదార్థం. అయితే మధ్యాహ్నం మరియు సాయంత్రం వేళలో మన శారీరక శ్రమ అనేది బాగా తగ్గిపోతుంది.
దోసకాయను రాత్రి టైంలో తింటే దీనిలో ఉండే పీచు పదార్థం తొందరగా జీర్ణం కాదు. అందువల్ల దీనిని తినడం వలన కడుపు అనేది ఉబ్బి అపాన వాయువు ఏర్పడుతుంది. దీంతో నిద్ర అనేది సరిగ్గా పట్టదు. కావున పొట్ట సమస్యలు ఉన్నవారు కొద్ది రోజులపాటు కీరదోసకా యను తినకుండా ఉండడమే మంచిది. అయితే కీర దోసకాయను ప్రతిరోజు తీసుకునే అలవాటు ఉంటే మధ్యాహ్నం వేళలో తీసుకుంటే మంచిది అని అంటున్నారు