పరిగడుపున ఎలాంటి పదార్థాలను తీసుకోవాలి.. ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదో మీకు తెలుసా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

పరిగడుపున ఎలాంటి పదార్థాలను తీసుకోవాలి.. ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదో మీకు తెలుసా…

 Authored By aruna | The Telugu News | Updated on :4 July 2023,7:00 am

ప్రస్తుతం చాలామంది ఉరుకుల బేరుకుల జీవితంలో సరియైన ఆహారాన్ని సక్రమంగా తీసుకోలేకపోతున్నారు.. ఇలా సరియైన ఆహారం తీసుకోలేకపోవడంతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.. కావున ఆహారం విషయంలో ఆరోగ్య నిపుణులు కొన్ని విషయాలను తెలియజేస్తున్నారు. వీటిని గనక అనుసరిస్తే మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అయితే ఎటువంటి ఆహారం ఎప్పుడు తినాలి.. అనేది తప్పక తెలుసుకోవాల్సిన విషయం. కొన్ని రకాల ఆహార పదార్థాలను పరిగడుపున తీసుకుంటే మంచిది.. అదే సమయంలో కొన్ని పదార్థాలను తీసుకుంటే మంచిది కాదు..

అయితే ఎటువంటి ఆహారం ఎప్పుడు తీసుకోవాలి అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అయితే చాలామంది బెడ్ కాఫీ అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఇది దీనిని నిద్ర నుంచి లేవగానే తాగుతూ ఉంటారు. ఇది అస్సలు మంచి అలవాటు కానే కాదు. దీని వలన చాతిలో మంట, డిహైడ్రేషన్ లాంటి సమస్యలు వస్తాయి.. పరిగడుపున నీళ్లు తాగడం చాలా అవసరం. కానీ చల్లని నీళ్లను అసలు తాగకూడదు.. దీని వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గోరువెచ్చని నీటిని తాగడం వలన మేలు జరుగుతుంది.
పరిగడుపున లేచిన వెంటనే మద్యం తాగడం మరి హానికరం. ఇది నేరుగా లివర్ పై పడుతుంది. మీ బ్లడ్ లో ఆల్కహాల్ వేగంగా వ్యాపించి ఎన్నో అనారోగ్య సమస్యలకి కారణం అవుతుంది..

Do you know what kind of ingredients should be taken

Do you know what kind of ingredients should be takenDo you know what kind of ingredients should be taken

కొంతమంది మసాలా పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు. అయితే ఇలాంటి పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వీటి వలన కడుపులో ఆసిడిటీ లాంటి సమస్యలు వస్తాయి. ఫైబర్ కొట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం వాటిల్లుతుంది. దాని ఫలితంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే పరిమిత మోతాల్లోనే ఫైబర్ పదార్థాలను తీసుకోవాలి. పరిగడుపున తీసుకునే ఆహారం ఎంత తేలిగ్గా ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది.

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది