Diabetes : మధుమేహం ఎందుకు వస్తుందో తెలుసా.. తెలిస్తే షాక్ అవుతారు..
Diabetes : ప్రస్తుత కాలంలో చాలా రోగాల మనను తొందరగా చుట్టు ముడుతున్నాయి. దీని కారణం మన లైఫ్ స్టైల్, భోజన విధానం వంటివి కారణం అవుతున్నాయి. ప్రస్తుతం చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా దాదాపు అందరిలో వస్తున్న వ్యాధి డయాబెటిస్. ఇందుకు ముఖ్య కారణం పట్టణీకరణ, నాగరీకరణ అని చెబుతున్నారు వైద్యులు. మనకంటే ముందు నాగరికత సంపాదించుకున్న దేశాల కన్నా.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మన దేశంలో నాగరికత అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నది. వీటికి ముఖ్య కారణం జెనెటిక్స్ అని తేలింది. మన దేశంలో చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు.
వారిలో ముఖ్య కారణం జన్యుపరమైనవే నని స్పష్టం చేస్తున్నారు డాక్టర్స్. మరి అసలు అవేంటో చూసేద్దామా..వంశ పారంపర్యంగా డయాబెటిస్ సంక్రమించే చాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అమెరికా వంటి దేశాల్లో షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సగటు వయస్సు 59 సంవత్సరాలు కాగా, మన దేశంలో అది 43 సంవత్సరాలుగా ఉంది. కారణం ఏంటంటే మన దేశంలో ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులు, వారసత్వ ఆహారపు అలవాట్లను వదిలు పాశ్చాత్య ఆహారపు అలవాట్లును అనుసరించడం వల్ల అవి మన శరీరానిని వ్యతిరేకంగా మారుతున్నాయి.
Diabetes : వంశ పారంపర్యంగా..
ఫలితంగానే ఉబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తున్నాయి. మరి ఇలాంటి ఆరోగ్య సమస్యలకు మీరు దూరంగా ఉండాలి అనుకుంటే లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లలో పాశ్చత్య సంస్కృతిని కాస్త దూరం పెట్టడం బెటర్. లేదంటే చిన్న వయస్సులోనే అనేక రోగాల బారిన పడటం ఖాయం. ఇక షుగర్ వ్యాధి అనేది చాలా మంది జీవితాల్లో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అలాంటివి మీ దరికి చేరొద్దంటే ఇప్పటికైనా ఆహారపు అటవాట్లలో మార్పులు చేసుకోండి. ఆరోగ్య కరమైన లైఫ్ ను ఎంజాయ్ చేయండి.