TEA : టీ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా..? అయితే అనవసరంగా ఇబ్బంది పడతారు…!!
TEA : టీ కాఫీలు ఉదయం ఫ్రెష్ గా ఉండడం కోసం తాగుతూ ఉంటారు. ఇంకొంతమంది టీ ని అలవాటుగా మార్చుకొని నాలుగైదుకప్పులు లాగిస్తూ ఉంటారు. భారతదేశంలో టీ తాగే వారి సంఖ్య మిలియన్లు దాటుతుంది. ఇలా మన దేశంలో నీటి తర్వాత రెండోది ఎక్కువగా పానీయంగా తీసుకునేది టీ అని చెప్తున్నారు. అయితే కోరుకున్న రుచిని ఆస్వాదించడానికి ఇంట్లోనే టీ చేసుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. నల్ల మిరియాలు, అల్లం, యాలకులు, తులసి లాంటి వాటిని తేనె కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ తేనె కలిపిన టీ తాగడం చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే దాన్ని తయారు చేసేటప్పుడు
కొన్ని తప్పులు చేస్తే మీరు అనవసరంగా ఇబ్బంది పడవలసి వస్తుంది. టీ సరైన తయారీ విధానం ఇదే.. బ్రిటిష్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ ప్రకారం టీ చేయడానికి మొదట రెండు పాత్రలు తీసుకోవాలి. దాన్లో పాలు మరిగించి ఇంకొక దాంట్లో నీరు మరిగించి మధ్య మధ్యలో చెంచా సహాయంతో పాలు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వేడినీటిలో టీ ఆకులు, పంచదా వేసి కలుపుతూ ఉండాలి. దీనిలో ఏదైనా మసాలా దినుసులను యాడ్ చేసుకోవచ్చు.. రెండు పాత్రల్లోని పాలు మరిగిన తర్వాత మీరు ఈ ఆకులు ఉన్న మిశ్రమంలో ఉడికించిన పాలను కలుపుకోవాలి. తర్వాత కప్పులోకి వడకట్టుకోవాలి.
ఈ విధంగా చేయడం వలన పాలు టీ ఆకులు కలిపి ఎక్కువ సేపు మరగబెట్టకూడదు. ఎందుకనగా ఇది కడుపు నొప్పిని కలిగిస్తుంది. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. టీ చేసేటప్పుడు ఇలాంటి తప్పులు చేయవద్దు.. టీ చేయడం కోసం చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని గుర్తించుకోవాల్సిన చాలా ఉంటాయి. కొంతమంది ముందుగా పాలను మరిగించి పూర్తిగా మరిగిన తర్వాత అందులో నీళ్లు పంచదార వేస్తూ ఉంటారు. చాలామందికి స్ట్రాంగ్ టీ తాగాలని కోరుకుంటూ ఉంటారు కానీ అలా తాగడం వలన గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి. టీలో పంచదార ఎక్కువగా కలుపుకునే వారు వారి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీని వలన ముందు ముందు ఎన్నో వ్యాధులకు దారితీస్తుంది.