Reheat Food : మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటున్నారా... ఇలా చేస్తే ఇదే జరుగుతుంది...?
Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజుల్లో ఫ్రిడ్జ్లు ఉండడం చేత, ప్రతి ఒక్కరూ మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్లో దాచుకొని,మరల వేడి చేసుకుని తినడం అలవాటుగా చేసుకుంటున్నారు. అన్ని ఆహారాలు కంటే, కొన్ని ఆహారాలను ఒక్కసారి వండిన తర్వాత మళ్లీ వేడి చేసి తింటే అది శరీరానికి తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు అంటున్నారు నిపుణులు.ఇలాంటి అలవాట్లు క్రమంగా ఆరోగ్యాన్ని క్షినింపజేస్తాయి. ఒకసారి వండిన ఆహారాలని ,మరలా మరలా వేడి చేసుకుని తినకూడని ఆహార పదార్థాలు ఏవో తెలుసుకుందాం…
Reheat Food : మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటున్నారా… ఇలా చేస్తే ఇదే జరుగుతుంది…?
ఒకసారి వండిన ఆహారాన్ని రాత్రి లేదా మరుసటి రోజు వేడి చేసి తినే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే, బాసిల్ల సెరియస్ అనే ఒక రకం బ్యాక్టీరియా, బియ్యం లో ఉండే అవకాశం ఉంది. ఇది వేడి చేసినప్పుడు చనిపోవచ్చు. దీని వల్ల వాంతులు,కడుపునొప్పి, తలనొప్పి లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.
పాలకూర : పాలకూర లాంటి ఆకుకూరల్లో నైట్రేట్ అనే పదార్థం సహజంగా ఉంటుంది. ఇది మళ్ళీ వేడి చేస్తే నైట్రేట్ హానికర పదార్ధంగా మారే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల రక్తానికి ఆక్సిజన్ అందడం తగ్గిస్తుంది.ముఖ్యంగా, చిన్నపిల్లలు గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి.
గుడ్లు : గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. గుడ్డు ఒకసారి ఉండి తినేయాలి. కానీ, మళ్ళీ వేడి చేసి తింటే,ఇందులో ఉన్న ప్రోటీన్లు గట్టిగా మారి జీర్ణ క్రియ కు ఆటంకాన్ని ఏర్పరుస్తాయి. కడుపునొప్పి,దాహం లాంటి సమస్యలు వస్తాయి.
చికెన్ ఇంకా ఇతర మాంసాహారాలు : చికెన్ లాంటి మాంసాహారాలను ఒకసారి వండిన తర్వాత ఫ్రిజ్లో నిలువ పెట్టి,తర్వాత దానిని వేడి చేసుకుని తింటే,ఆరోగ్యానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే దీనిపై బ్యాక్టీరియా పెరగవచ్చు. దీంతో తేలికపాటి ఫుడ్ పాయిజింగ్ నుండి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. వండిన వెంటనే తింటే మంచిది.
సీపుడు ( సముద్రపు ఆహారపు చేపలు, రొయ్యలు) : ఈ సీపుడు దాదాపు ప్రతి ఇంట్లో ఇష్టమైన ఆహారం. అయితే, మళ్లీ వేడి చేసి తింటే,ఇందులో ఉన్న ప్రోటీన్లు నశింపబడతాయి. ఈ మార్పులు కొంతమందిలో అలర్జీ లేదా దద్దుర్లు ఇంకా గ్యాస్ వంటి సమస్యలకు దారి తీయవచ్చు.
పుట్టగొడుగులు : పుట్టగొడుగులు ప్రోటీన్,విటమిన్ లను ఎక్కువ కలిగి ఉంటుంది. అయితే ఈ పదార్థాన్ని మళ్లీ వేడి చేస్తే ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ కూడా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి,శరీరానికి హానికరం కావచ్చు. కొంతమందిలో అజీర్ణం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.
వండిన బంగాళదుంప : వండిన బంగాళదుంప గాలి చొరబడకుండా జాగ్రత్తగా ఉంచకపోతే,అవి వేడి చేస్తే, విషపూరిత పదార్థంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి,జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. వీటిని ఫ్రెష్ గా వండుకొని వెంటనే తినేయాలి. ఆహార పదార్థాలను ఒకసారి వండిన తర్వాత మళ్లీ వేడి చేయడంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.కొన్ని వంటకాలము మొదటసారిగా వండిన వెంటనే తినేయడం ఉత్తమం. ముఖ్యంగా, పిల్లలు,గర్భిణీలు,వృద్ధులు మళ్ళీ వేడి చేసిన ఆహారాలు తీసుకోకపోతేనే మంచిది.
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
This website uses cookies.