Telangana : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడబోతుందా..?
Telangana : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ, పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారనే ఊహాగానాలు జోరుగా చర్చకు రావడం కాంగ్రెస్ శిబిరంలో ఉద్రిక్తతను కలిగిస్తోంది. ఒక మహిళా మంత్రితో నెలకొన్న విభేదాలే ఇందుకు కారణమని సమాచారం. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు స్పష్టంగా తెలిపారు.
Telangana : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడబోతుందా..?
సదరు మంత్రి తమ నియోజకవర్గాల్లోకి జోక్యం చేసుకోవడం, ఆమె కుటుంబ సభ్యులు అధికార వాడకంలో హద్దులు మించినట్లుగా వ్యవహరించడంపై ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని, నియోజకవర్గాల్లో తన అధికారాన్ని ఆ మంత్రి దుర్వినియోగం చేస్తున్నారని ఎమ్మెల్యేలు విమర్శించారు. పార్టీ నేతలు స్పందించకపోతే తాము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడమే కాక, ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేస్తామని వారు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర నేతలు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సమాచారం. మంత్రిపై తగిన చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగిందని చెబుతున్నారు. ప్రస్తుతానికి పార్టీ అంతర్గత విభేదాలను బహిరంగంగా రానివ్వకుండా చర్చలతో పరిష్కరించే ప్రయత్నంలో ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ఆరోపణలపై సదరు మంత్రి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఈ వ్యవహారాన్ని బిఆర్ఎస్ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది.
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…
Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్…
This website uses cookies.