Heart Attack : ఇలాంటి గుండెనొప్పిని అస్సలు నమ్మకండి.. చాలా డేంజర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Heart Attack : ఇలాంటి గుండెనొప్పిని అస్సలు నమ్మకండి.. చాలా డేంజర్..!

Heart Attack : ఈ రోజుల్లో గుండెపోటు మరణాలు.. హార్ట్ ఎటాక్ లాంటివి తరచూ వినిపిస్తున్నాయి. ఒకప్పుడు హార్ట్ ఎటాక్ మరణాలు చాలా రేర్ గా వినిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు పెద్ద వయసు వారిలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం చిన్న వయసు వారిలో కూడా కనిపిస్తున్నాయి. దాంతో ప్రజలు నిత్యం ఆందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. అయితే […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 April 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Heart Attack : ఇలాంటి గుండెనొప్పిని అస్సలు నమ్మకండి.. చాలా డేంజర్..!

Heart Attack : ఈ రోజుల్లో గుండెపోటు మరణాలు.. హార్ట్ ఎటాక్ లాంటివి తరచూ వినిపిస్తున్నాయి. ఒకప్పుడు హార్ట్ ఎటాక్ మరణాలు చాలా రేర్ గా వినిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు పెద్ద వయసు వారిలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం చిన్న వయసు వారిలో కూడా కనిపిస్తున్నాయి. దాంతో ప్రజలు నిత్యం ఆందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. అయితే గుండె నొప్పిలో చాలా రకాలు ఉంటాయి. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.వాటిని నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతి అని డాక్టర్లు చెబుతున్నారు. చాలా మందికి గుండెపోటు ముందు వచ్చే నొప్పికి సాధారణ నొప్పికి తేడాలు తెలియవు. దాంతో కొందరు నొప్పి వచ్చినా సరే లైట్ తీసుకుంటారు ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఇంట్లోనే ఉండిపోతారు. అలాంటి వారికి గుండెపోటు వచ్చి సడెన్ గా ప్రాణాలు కోల్పోయే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది.

Heart Attack : నిర్లక్ష్యం చేయొద్దు..

తీవ్రంగా నొప్పి వస్తుంటే మాత్రం కచ్చితంగా నిర్లక్ష్యం చేయొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ కొందరు మాత్రం తేడాలు తెలియక.. అది సాధారణనొప్పి అనుకుంటారు. ఇలాంటి వారి కోసం ఇప్పుడు కొన్ని టిప్స్ తెలుసుకుందాం.భరించ లేనంత చాతినొప్పి చిన్నదే కావచ్చు. కానీ ఛాతినొప్పి వచ్చే సమయంలో నొప్పి మెడ, దవడకు, తరువాత వెనుకకు లేదా కిందకి, ఒకటి లేదా రెండు చేతులకు వ్యాపిస్తుంది. అప్పుడు అస్సలు విస్మరించకూడదు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ నొప్పి గుండె సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది. ఛాతినొప్పిలో కూడా వివిధ రకాలు ఉంటాయి.

Heart Attack ఇలాంటి గుండెనొప్పిని అస్సలు నమ్మకండి చాలా డేంజర్

Heart Attack : ఇలాంటి గుండెనొప్పిని అస్సలు నమ్మకండి.. చాలా డేంజర్..!

ఛాతినొప్పి వచ్చే సమయంలో వికారం వాంతులు కూడా అవుతాయి. అప్పుడు అస్సలు లైట్ తీసుకోవద్దు.

చాతినొప్పి వచ్చిన సమయంలోనే చల్లని చెమటలు వస్తుంటాయి. వాటిని అస్సలు లైట్ తీసుకోవద్దు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినప్పుడు కూడా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి.

గుండె వేగంగా కొట్టుకుంటే కూడా అది తీవ్రమైన గుండె నొప్పికి దారి తీస్తుంది.

మైకము లేదా బలహీనతగా ఉన్నా కూడా వెంటనే చికిత్స తీసుకోవాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది