Morning Tea : ఉదయాన్నే టీ బదులుగా ఇది తాగండి.. పొట్ట తగ్గుతుంది.. కిడ్నీలు, లివర్ శుభ్రం అవుతాయి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Morning Tea : ఉదయాన్నే టీ బదులుగా ఇది తాగండి.. పొట్ట తగ్గుతుంది.. కిడ్నీలు, లివర్ శుభ్రం అవుతాయి…!

 Authored By aruna | The Telugu News | Updated on :18 May 2023,7:00 am

Morning Tea : నిద్ర లేచిన వెంటనే చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది. లేదా మరి కొంతమంది కాఫీ తాగుతుంటారు. వీటికి బదులుగా ఈ విధంగా తాగి చూడండి మీరు ఆరోగ్యాన్ని పదింతలు పెంచుకుంటారు. ఇప్పటికే మిమ్మల్ని వేధిస్తున్నటువంటి అనేక సమస్యల నుంచి మీరు బయటపడగలరు.. కిడ్నీలు ఇలాంటి రకరకాల అవయవాలు పనితీరును పెంచేటువంటి ఒక దివ్య ఔషధం గురించి మీరంతా తెలుసుకోబోతున్నారు.. ఇంటికి చుట్టాలుగా వెళ్ళిన సరే కచ్చితంగా అందరూ ఆహ్వానించేది ఈ వేసవికాలంలో కూల్ డ్రింక్ తోని పిల్లల్ని ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు.

ఏదైనా పార్టీ చేసుకున్న సరదాగా ఫ్రెండ్స్ తో గేదరైన అందరూ కూల్ డ్రింక్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు.మన ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి ఒక రకమైన భయంకరమైన పానీయం అని చెప్పచ్చు.. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారో వారు తొందరగా బరువు పెరుగుతారు. వాస్తవానికి కూల్ డ్రింక్స్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ తో పాటు గ్యాస్ కూడా ఉంటుంది. ఎంత తగ్గిస్తే మన జీవితంలో అంత ఆరోగ్యంగా ఉంటామని ఇప్పటికే చెప్తున్నారు. మనం తీసుకునేటువంటి చక్కెర ఒక్క రోజుకి కేవలం 25 గ్రాములు మాత్రమే ఉండాలని చెప్తుంది.

వీటన్నిటికీ బదులుగా ఈ నిమ్మకాయ జ్యూస్ తీసుకోవాలి. ఈ నిమ్మకాయలో ఈ విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి ఒక నిమ్మకాయని పూర్తిగా మనం ప్రతిరోజు తీసుకుంటే 18.6 మిల్లి గ్రామంలో విటమిన్ సి మనకి లభిస్తుంది. పరిశోధనల ఫలితం నిమ్మరసం తాగటం వల్ల అధిక బరువును తగ్గించుకోవటం ఎంతో సులభం అవుతుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగితే అధిక బరువు పెరగకుండా చేస్తాయి. తొందరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను మీకు అందిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే అందరు పరిగడుపున గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసాన్ని కలుపుకొని తాగటం అలవాటు చేసుకోండి..

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది