ఎక్కువగా నీళ్లు తాగుతున్నారా..? అయితే సమస్యలు తప్పవు
drinking water వేసవి ఎండలు మండిపోతున్న ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు అధిక మొత్తంలో మంచినీళ్లు తాగటం అనేది జరుగుతుంది. సగటున మనిషి రోజుకు 6 లీటర్లు నీళ్లు తాగాలని చెప్పటంతో ఎండాకాలంలో అదే పనికి నీళ్లు తాగేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ విధంగా ఎక్కువ నీళ్లు తాగటం వలన కూడా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
శరీరానికి ఇవ్వాల్సిన నీరు కంటే ఎక్కువగా ఇస్తే, మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందంటున్నారు నిపుణులు. వైద్య పరిభాషలో చెప్పాలంటే దీన్ని వాటర్ ఇన్ టాక్సికేషన్ అంటారు.నీళ్లు ఎక్కవుగా తాగటం వలన శరీరం నీటి మత్తుకు లోనవుతుంది. ఇది శరీరంలోని ఉప్పు, ఇతర ఎలక్ట్రోలైట్స్ ను పలచన చేస్తుంది. దీనితో సోడియం స్థాయి తగ్గిపోతుంది. సోడియం స్థాయి తగ్గిపోయినప్పుడు శరీరంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.
drinking water : దీని వలన మూత్రపిండాలు బలహీనపడుతాయి
దీని వలన మూత్రపిండాలు బలహీనమవుతునాయి. మైకం, వికారం, తలనొప్పి లాంటి లక్షణాలు బయటపడుతాయి. మరికొన్ని సందర్భాల్లో బరువు పెరిగే అవకాశం ఉందని, ఇలా అతిగా నీరుతాగే లక్షణం మరింత పెరిగితే.. మెదడుపై ఆ ప్రభావం పడుతుంది. బీపీ పెరగడంతో పాటు, కండరాలు నీరసించిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి మన శరీరానికి ఎంత అవసరమో, అంతే నీళ్లు తాగాలి.
రోజుకి సాధారణంగా 6 నుండి 8 గ్లాసుల నీరు తీసుకుంటే మంచిదని చెపుతున్నారు. వేసవి కాలంలో పది గ్లాసుల వరకు నీరు తీసుకోవాలని చెపుతున్నారు. దాహం వేసినప్పుడు మాత్రం నీరు తీసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ సార్లు తాగాల్సి వస్తే, తక్కువ మోతాదులో నీరు తీసుకోవటం ఉత్తమం. కాబట్టి మన శరీరానికి నీరు ఎంత అవసరమో అంత వరకు మాత్రమే తీసుకోవాలి