Lemon Grass Tea : లెమన్ గ్రాస్ టీ తాగితే ఒత్తిడి,కిడ్నీ, చర్మ, కండరాల నొప్పులు మాయం…!
Lemon Grass Tea : మన దేశంతో పాటు పలు ఆసియా దేశాల్లోనూ లెమన్ గ్రాస్ మొక్క బాగా పెరుగుతుంది. ఈ మొక్క ఆకుల్లో అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ ,యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన పలు అనారోగ్య సమస్యలకు ఈ ఆకుల ఔషధంగా పనిచేస్తాయి. నిత్యం ఈ లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాం . లెమన్ గ్రాస్ ఆకుల టీ తాగడం వల్ల దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి.. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, కడుపునొప్పి తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది.
ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. మలబద్ధకం తగ్గుతుంది. పలు రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. కిడ్నీ సమస్యలు పోతాయి. మూత్రం సాఫీగా వస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్ధాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. అధిక బరువు తగ్గుతారు. చర్మ సమస్యలు పోతాయి.ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ పదార్థాల శాతం కూడా ఎక్కువే.. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని బాధపడుతున్న సమస్య నిద్రలేమి. లెమన్ గ్రాస్ తో చేసిన టీ కండరాలను మైండ్ ని రిలాక్స్ అయ్యేలా చేసి ప్రశాంతంగా నిద్రపట్టేలా చేస్తుంది.
తొందరగా కంగారు పడిపోవటం అల్మర్ష్ లాంటి సమస్యలు ఉన్నవాళ్లు ఈ టీ డైలీ తాగితే నెమ్మదిగా ఈ యాంగ్ సైటీ తగ్గుతుంది. ఇది స్టమక్ లో ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేస్తుంది. భోజనం కంటే ముందు ఒక కప్పు లెమన్ గ్రాస్ టీ తాగితే బాడీలో టాక్సిన్స్ క్లీన్ చేసి మనం తినే ఆహారం నుంచి ఎక్కువ ప్రోటీన్స్ న్యూట్రియన్స్ బాడీకి అందేలా జీవన ప్రక్రియని బాగు చేస్తుంది. తల తిప్పటం, కడుపునొప్పి లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.