Diabetes : దేశంలో అత్యధిక మందిని ఇప్పుడు తెగ భయపెడుతున్న వ్యాధి మధుమేహం. ఎంతో మంది షుగర్ భారిన పడి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. డయాబెటిస్ ను పూర్తిగా నివారించే మందు మనకు ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ సరైన ఆహార నియమావళి పాటిస్తే షుగర్‌ను నియంత్రించవచ్చని చెబుతున్నారు. అలాగే షుగర్‌తో బాధపడుతున్న వారు కొన్ని ఆహారపదార్థాలను తీసుకోకూడదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఏవి తినాలో ఏవి తినవద్దో అని అంతా అయోమయంలో ఉన్నారు. ముఖ్యంగా తీపికి సంబంధించిన ఏ పదార్ధాన్ని కూడా ముట్టుకోవడానికే భయపడుతున్నారు. దీంతో ఎంతో కాలంగా వారి నోటికి కనీసం తీపి అనేదే తగలకుండా తమ ఇష్టాన్ని చంపుకుంటున్నారు. అయితే షుగర్ ఉన్న వాళ్ళు కూడా లడ్డు తినవచ్చునట.
అయితే అది మామూలుగా అందరూ తినే లడ్డు కాదు.. కానీ ఈ లడ్డు తిన్నా మంచి స్వీట్ తిన్నామనే భావన కలుగుతుందట.మనం ఎంత సేపు చెప్పుకుంది డ్రైఫ్రూట్స్ లడ్డు గురించే. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తినడం వల్ల మన శరీరానికి ప్రోటీన్స్ అందుతాయి. అయితే డ్రైఫ్రూట్స్ లడ్డుని కొనేంత స్తోమత అందరికీ ఉండదు. అందుకోసం తక్కువ ఖర్చులో డ్రైఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.దీని కావాల్సినవి గుమ్మడి గింజలు పుచ్చ పప్పు పప్పు ఎండు కొబ్బరి పొడి కొంచెం ఖర్జూరం తేనె కావాలి. తయారుగా పెట్టుకున్న పప్పుల్లో… మూడవ వంతు పప్పులతో పాటు వాటిలో ఒక వంతు ఖర్జూరం తీసుకోవాలి అన్ని రకాల పప్పులతో పాటు ఎండుకొబ్బరిని కూడా రెండు నిమిషాల పాటు వేయించి..
వీటన్నిటినీ ఒక మిక్సీలో వేసి పట్టుకోవాలి. ఈ మిశ్రమంలో కొంచెం తేనె వేసి స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం వేడి చేయాలి. అది కాస్త వేడి అయ్యాక ముందుగా తీసి పెట్టుకున్న మిగిలిన పప్పులన్నీ అందులో వేసి కలిపి ఉండలుగా చేసుకోవాలి. డ్రైఫ్రూట్స్ లడ్డు రెడీ.ఈ లడ్డుని రోజు మధ్యాహ్నం ఒకటి చొప్పున తినడం వలన మన శరీరానికి రక్తం ప్రోటీన్స్ అందుతాయి. అంతేకాదు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి డయాబెటిస్ ఉన్నవారు మాత్రమే కాక పిల్లలు పెద్దవారు కూడా తినవచ్చు. దీని వల్ల షుగర్ పెరిగే అవకాశం అయితే ఉండదు స్వీట్స్ తినడం వల్ల దంత సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తాయి అయితే వీటి వల్ల ఇలాంటి సమస్యలు రావు. దాంతో పాటు వీటి వల్ల బరువు పెరిగే అవకాశం అస్సలు ఉండదు.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.