Diabetes : షుగర్ ఉన్నవాళ్లు ఈ లడ్డూలు హ్యాపీగా తినవచ్చు.. అనారోగ్యం కాదు.. ఆరోగ్యమే ఇవి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : షుగర్ ఉన్నవాళ్లు ఈ లడ్డూలు హ్యాపీగా తినవచ్చు.. అనారోగ్యం కాదు.. ఆరోగ్యమే ఇవి..!

Diabetes : దేశంలో అత్యధిక మందిని ఇప్పుడు తెగ భయపెడుతున్న వ్యాధి మధుమేహం. ఎంతో మంది షుగర్ భారిన పడి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. డయాబెటిస్ ను పూర్తిగా నివారించే మందు మనకు ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ సరైన ఆహార నియమావళి పాటిస్తే షుగర్‌ను నియంత్రించవచ్చని చెబుతున్నారు. అలాగే షుగర్‌తో బాధపడుతున్న వారు కొన్ని ఆహారపదార్థాలను తీసుకోకూడదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఏవి తినాలో ఏవి తినవద్దో అని అంతా అయోమయంలో ఉన్నారు. ముఖ్యంగా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :20 December 2021,1:00 pm

Diabetes : దేశంలో అత్యధిక మందిని ఇప్పుడు తెగ భయపెడుతున్న వ్యాధి మధుమేహం. ఎంతో మంది షుగర్ భారిన పడి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. డయాబెటిస్ ను పూర్తిగా నివారించే మందు మనకు ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ సరైన ఆహార నియమావళి పాటిస్తే షుగర్‌ను నియంత్రించవచ్చని చెబుతున్నారు. అలాగే షుగర్‌తో బాధపడుతున్న వారు కొన్ని ఆహారపదార్థాలను తీసుకోకూడదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఏవి తినాలో ఏవి తినవద్దో అని అంతా అయోమయంలో ఉన్నారు. ముఖ్యంగా తీపికి సంబంధించిన ఏ పదార్ధాన్ని కూడా ముట్టుకోవడానికే భయపడుతున్నారు. దీంతో ఎంతో కాలంగా వారి నోటికి కనీసం తీపి అనేదే తగలకుండా తమ ఇష్టాన్ని చంపుకుంటున్నారు. అయితే షుగర్ ఉన్న వాళ్ళు కూడా లడ్డు తినవచ్చునట.

అయితే అది మామూలుగా అందరూ తినే లడ్డు కాదు.. కానీ ఈ లడ్డు తిన్నా మంచి స్వీట్ తిన్నామనే భావన కలుగుతుందట.మనం ఎంత సేపు చెప్పుకుంది డ్రైఫ్రూట్స్ లడ్డు గురించే. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తినడం వల్ల మన శరీరానికి ప్రోటీన్స్ అందుతాయి. అయితే డ్రైఫ్రూట్స్ లడ్డుని కొనేంత స్తోమత అందరికీ ఉండదు. అందుకోసం తక్కువ ఖర్చులో డ్రైఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.దీని కావాల్సినవి గుమ్మడి గింజలు పుచ్చ పప్పు పప్పు ఎండు కొబ్బరి పొడి కొంచెం ఖర్జూరం తేనె కావాలి. తయారుగా పెట్టుకున్న పప్పుల్లో… మూడవ వంతు పప్పులతో పాటు వాటిలో ఒక వంతు ఖర్జూరం తీసుకోవాలి అన్ని రకాల పప్పులతో పాటు ఎండుకొబ్బరిని కూడా రెండు నిమిషాల పాటు వేయించి..

dry fruits laddu for sugar patients for their better health

dry fruits laddu for sugar patients for their better health

Diabetes : డ్రైఫ్రూట్స్ లడ్డు తయారీ విధానం:

వీటన్నిటినీ ఒక మిక్సీలో వేసి పట్టుకోవాలి. ఈ మిశ్రమంలో కొంచెం తేనె వేసి స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం వేడి చేయాలి. అది కాస్త వేడి అయ్యాక ముందుగా తీసి పెట్టుకున్న మిగిలిన పప్పులన్నీ అందులో వేసి కలిపి ఉండలుగా చేసుకోవాలి. డ్రైఫ్రూట్స్ లడ్డు రెడీ.ఈ లడ్డుని రోజు మధ్యాహ్నం ఒకటి చొప్పున తినడం వలన మన శరీరానికి రక్తం ప్రోటీన్స్ అందుతాయి. అంతేకాదు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి డయాబెటిస్ ఉన్నవారు మాత్రమే కాక పిల్లలు పెద్దవారు కూడా తినవచ్చు. దీని వల్ల షుగర్ పెరిగే అవకాశం అయితే ఉండదు స్వీట్స్ తినడం వల్ల దంత సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తాయి అయితే వీటి వల్ల ఇలాంటి సమస్యలు రావు. దాంతో పాటు వీటి వల్ల బరువు పెరిగే అవకాశం అస్సలు ఉండదు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది