Dry Lips : చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలైనట్లే. ఇతర సీజన్ కంటే చలికాలం అంటే ఆడవాళ్లకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ కాలంలో చర్మం మరియు పెదాలు అనేవి బాగా పగిలిపోతూ ఉంటాయి. ఈ చలికాలంలో స్కిన్ డ్యామేజ్ అనేది అధికంగా ఉంటుంది. ఈ కాలంలో చర్మానికి ఖచ్చితంగా మాయిశ్చరైజర్లు అప్లై చేసుకోవాలి. చలి ఎక్కువగా ఉండటం వలన చర్మం అనేది పగిలి తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చేతులు మరియు కాళ్ళ పై కూడా గీతలు వస్తాయి. అలాగే పెదాలు కూడా బాగా పగిలిపోతూ ఉంటాయి. అంతేకాక పెదాలపై చర్మం పొరల పొరలుగా ఊడి వస్తుంది. ఈ తరుణంలో స్కిన్ పరంగా ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం బయట వాటిని కొనే బదులుగా ఇంట్లో హోమ్ రెమిడీస్ ని పాటించండి. ఇవి ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే మార్కెట్లో దొరికే వాటికంటే ఇంట్లో హోమ్ రెమెడీస్ పాటించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే పెదాలు మెత్తగా మరియు మృదువుగా మారుతాయి. మరీ ఆ చిట్కాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
నూనె రాసుకోండి : చలికాలం మొదలవగానే మనం ముందుగా పెదాలపై ఎంతో శ్రద్ధ పెట్టాలి. రాత్రి పడుకునే టైంలో పెదాలపై కొబ్బరి నూనె రాసుకుని పడుకోవాలి. ఈ కొబ్బరి నూనెను పెదాలకు రాసుకోవడం వలన పెదాలు అనేవి మెత్తగా మారతాయి. అలాగే ఈ కొబ్బరి నూనెలో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. కావున పెదాలు ఎంత ఆరోగ్యంగా ఉంటాయి…
వెన్న : కొంతమందికి పెదాలు అనేవి బాగా పగిలిపోయి పొరలు పొరలుగా ఊడుతుంది. ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు వెన్న రాసుకుంటే మంచిఫలితం ఉంటుంది. ఈ వెన్న ను పెదాలకు రాయటం వలన పెదాలనేవి మెత్తగా మరియు మృదువుగా మారతాయి. అలాగే పెదాలనేవి ఎంతో చక్కగా మెరుస్తాయి. అంతేకాక పేదలకు వెన్న రాయిస్తే చాలా మంచిది. రాత్రి పడుకునే ముందు లేక ఉదయం లేచిన వెంటనే పెదాలకు వెన్న రాసి కొద్దిసేపు మర్దన చేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. అలాగే పెదాలకు నెయ్యి రాయడం వలన కూడా ఎంతో మంచి ఫలితం ఉంటుంది…
తేనె : ఈ చలికాలంలో పెదాలు పగలడంతో ఒక్కోసారి రక్తం కూడా కారుతుంది. అలాంటి టైం లో తేనె అనేది ఎంతో చక్కగా పనిచేస్తుంది. అయితే ఈ తేనెలో యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు ఉంటాయి. కావున పెదాలకు తేనె రాస్తే పెదాలు తేమగా మారతాయి. అలాగే పెదాలకు తేనె రాయడం వలన పెదాలు కోమలంగా కూడా మారతాయి…
పచ్చిపాలు : పెదాలు మెత్తగా మరియు మృదువుగా మారాలి అంటే పచ్చిపాలను రాసుకోవాలి. ఈ పచ్చి పాలను కాటన్ సహాయంతో పెదాలకు రాస్తూ ఉండాలి. ఇలా గనక మీరు తరచుగా చేస్తూ ఉంటే పెదాలు అనేవి అస్సలు పగలవు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.