Eating 2 Apples : ప్రతిరోజు 2 యాపిల్ని... ఒక నెల రోజులు పాటు తినండి... ఆ తరువాత మీరు ఆశ్చర్యపోతారు...?
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే ఉంటారు. కానీ చాలామంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. ప్రతిరోజు ఒక యాపిల్ తిన్న సరే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్యులు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆపిల్ తినాలి. చాలా మంది ఉదయం లేవగానే అల్పాహారంగా యాపిల్ ని తింటూ ఉంటారు. కొంత మంది రోజుకి రెండు నుంచి మూడు యాపిల్ వరకు తింటారు. నిత్యం యాపిల్ తినేవారు డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదట. యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు. అయితే,రోజుకి రెండు యాపిల్స్ నెల రోజుల పాటు, అంటే 30 రోజులు వరకు తింటే మీ శరీరంలో ఒక అద్భుతం జరుగుతుంది. అది ఏమిటో తెలుసుకుందాం….
Eating 2 Apples : ప్రతిరోజు 2 యాపిల్ని… ఒక నెల రోజులు పాటు తినండి… ఆ తరువాత మీరు ఆశ్చర్యపోతారు…?
రోజుకి కనీసం రెండు యాపిల్ తింటే శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి అంటున్నారు నిపుణులు.అయితే, శరీరానికి ఈ ఆపిల్ ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యకరమైన చర్మం కూడా మీ సొంతం అవుతుంది అంటున్నారు. శరీరానికి మేలు చేసే ఈ ఆపిల్ తింటే,శరీరంలో అవసరమైన ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ క్రియ కూడా సరిగ్గా జరుగుతుంది. ఆరోగ్యవంతంగా ఉంటారు.
ప్రతి రోజు ఒక యాపిల్ తింటే మలబద్ధక సమస్య కూడా తగ్గిపోతుంది. ఇంకా,ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కూడా నివారించబడతాయి. ప్రతిరోజు రెండు చొప్పున ఆపిల్ తింటే చెడు కొలెస్ట్రాల్ (LDL )కరిగిపోగలదు. మంచి కొలెస్ట్రాల్ తయారవుతుంది.
అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజు రెండు యాపిల్ని తరచూ నెల రోజులు పాటు తింటే, బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా, ఆపిల్ కంటి చూపుని మెరుగుపరచడానికి కూడా సహకరిస్తుంది. రోజుకి రెండే రెండు యాపిల్ తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆపిల్ తింటే గుండెను ఆరోగ్యంగా సంరక్షించుకోవచ్చు.ఇంకా,చర్మ సమస్యలను నయం చేసుకోవచ్చు. చర్మాన్ని యవ్వనం గాను, ప్రకాశవంతంగా మెరిసేలా చేయగలదు. యాపిల్ లోని గుణాలు శరీరం నుంచి టాక్సీలను బయటకు పంపిస్తుంది. నిత్యం యాపిల్ తింటే చాలా రకాల క్యాన్సర్లు కూడా అరికట్టవచ్చు. యాపిల్ లో ఉండే గుణాలు పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్లు సంబంధించిన కణాలు పెరగకుండా అడ్డుకోగలవు,అని నిపుణులు చెబుతున్నారు.
ఆపిల్ శరీరంలో చెడు కొలెస్ట్రాలను తగ్గించి,మంచి కొలెస్ట్రాలను తయారు చేస్తుంది.ఇది తలనొప్పి, ఆస్తమా, ఉబ్బకాయం,ఎనీమియా, క్షయ, కీళ్ళ నొప్పులు,నాడి సమస్యలు, నిద్రలేని సమస్యలు,జలుబు వంటి అన్ని సమస్యలకు,ఆపిల్ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.ఆపిల్ కంటి చూపుని కూడా మెరుగుపరచగలదు. అని నిపుణులు తెలియజేస్తున్నారు.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.