Lungs Health : చలి కాలం ఈ ఆహార పదార్థాలతో ఊపరితిత్తులకు సంపూర్ణ ఆరోగ్యం..!
Lungs Health : భూమ్మీద రోజురోజుకూ విపరీతంగా కాలుష్యం పెరిగిపోతున్న సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే మనం తీసుకునే గాలిలో నాణ్యత తగ్గిపోతున్నది. దాంతో ప్రజలు ఊపిరి తీసుకునే పరిస్థితులు కూడా తగ్గిపోతున్నాయి. మన దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత బాగా పడిపోయింది. దాంతో అక్కడి ప్రజల ఊపరితిత్తుల ఆరోగ్యం దెబ్బతిని వారి ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉన్నది.ఈ క్రమంలోనే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకునేందుకుగాను ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనే విషయాలపై స్పెషల్ స్టోరి..
గాలి నాణ్యత తగ్గిపోవడం వలన మనుషుల ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు వారికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే చాన్సెస్ ఉన్నాయి. ఈ క్రమంలోనే శ్వాస కోశ వ్యాధులు, హార్ట్ డిసీజెస్, డయాబెటిస్ వస్తాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. కాగా, వాయుకాలుష్యం వల్ల ఏర్పడే హానికరమైన ప్రభావాలను రక్షించుకునేందుకుగాను ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. బెల్లం తీసుకోవడం ద్వారా కండరాలు బలంగా తయారవడంతో పాటు ఊపిరితిత్తులకు బ్లడ్ సప్లై కూడా ఈజీగా అవుతుంది. ఇకపోతే చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వల్ల చక్కటి ప్రయోజనాలున్నాయి.
Lungs Health : ఈ ఫుడ్ ఐటమ్స్‌తో హెల్దీ లంగ్స్..
చలికాలంలో ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండేందుకుగాను వెల్లుల్లిని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. లంగ్స్‌ను హెల్దీగా ఉంచేందుకుగాను ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే కొవ్వు చేప బాగా పని చేస్తుంది. యాంటీ కేన్సర్, ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండే ఫిషెస్ ఊపిరితిత్తుల వ్యాధులు రాకుండా కాపాడుతాయి. పసుపు, యాపిల్, వాల్నట్స్ , బీట్ రూట్, వెల్లుల్లి, అల్లం ఆహారంలో తప్పక భాగం చేసుకోవాలని పెద్దలు చెప్తున్నారు. వీటి వలన లంగ్స్‌తో పాటు హ్యూమన్ బాడీ యాక్టివ్‌గా ఉంటుందని అంటున్నారు. పసుపు, వెల్లుల్లి, అల్లం వంటింట్లో ఉండే సంప్రదాయ వస్తువులు. కాగా, ఇవి మానవుడికి దివ్య ఔషధంగా పని చేస్తాయి. విటమిన్స్ భాండాగారం అయిన యాపిల్ ఫ్రూట్‌ను ప్రతీ రోజు ఒకటి తీసుకుంటే అనారోగ్యం అస్సలు దరి చేరదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ఎప్పటి నుంచో చెప్తున్నారు.