Cheese And Bread : ఉదయాన్నే చీజ్ మరియు బ్రెడ్ ను కలిపి తీసుకుంటే… ఏం జరుగుతుందో తెలుసా…!!
ప్రధానాంశాలు:
Cheese And Bread : ఉదయాన్నే చీజ్ మరియు బ్రెడ్ ను కలిపి తీసుకుంటే... ఏం జరుగుతుందో తెలుసా...!!
Cheese And Bread : ప్రస్తుతం మనం ఉన్న ఈ ఆధునిక కాలంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసే వారి సంఖ్య నానాటికి బాగా పెరిగిపోతుంది. అలాగే ఎంతో హడావిడిగా బ్రెడ్ తీసుకొని వారి విధుల్లోకి వెళ్లిపోతున్నారు. అలాగే ఈ బ్రెడ్ లో చీజ్ కలుపుకొని మరి తింటూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే చిన్నారులు చీజ్ మరియు బ్రెడ్ ను అధికంగా తింటున్నారు. అయితే ఉదయం బ్రెడ్ మరియు చీజ్ కలుపుకొని పరిగడుపున తీసుకోవడం వలన మీ ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంతకీ బ్రెడ్ మరియు చీజ్ ను కలిపి తీసుకోవడం వలన కలిగే దుష్ప్రభావాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
– చీజ్ లో సోడియం కటెంటు అధికంగా ఉంటుంది. అందుకే చీజ్ ను అధికంగా తీసుకుంటే అధిక రక్తపోటు, ఎక్కువ కొలెస్ట్రాల్, స్ట్రోక్, గుండెపోటు లాంటి సమస్యలకు కూడా దారి తీస్తుంది అని నిపుణులు అంటున్నారు. అయితే ఒక చిన్న చీజ్ ముక్కల్లో దాదాపుగా 200 మిల్లీ గ్రాముల సోడియం అనేది ఉంటుంది..
– ఈ చీజ్ ముక్కలు చక్కనైన ఆకృతి మరియు స్మూత్ గా ఉండేందుకు కొన్ని రకాల కెమికల్స్ కూడా కలుపుతారు. అలాగే వీటిలో ఎమల్సి ఫైయర్ లు మరియు స్టెబిలైజర్ లతో పాటుగా కొన్ని కృత్రిమ రంగులను కూడా కలుపుతారు. ఇవి జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. అలాగే అలర్జీ లాంటి సమస్యలు కూడా వస్తాయి..
– అలాగే ఈ చీజ్ లో ప్రాసెస్ చేసిన కొవ్వులను కూడా కలుపుతారు. అయితే ఇవి బరువు పెరగటానికి దోహదపడతాయి. అలాగే టైప్ టు డయాబెటిస్ లాంటి సమస్యల బారినపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
– నాచురల్ జున్నుతో పోలిస్తే చీజ్ ముక్కల్లో పోషకాలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే వీటిలో విటమిన్ లు మరియు ఖనిజాలు, ప్రోబయోటిక్స్ లాంటి తక్కువ సమ్మేళనాలు ఉంటాయి..
– ఈ చీజ్ జీర్ణ సమస్యలకు కూడా దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఉదయనే చీజ్ తినడం వలన మలబద్ధక సమస్య వస్తుంది అని అంటున్నారు. అలాగే మైదా ఎక్కువ ఉండే బ్రెడ్ తో చీజ్ ను తింటే మరింత ప్రమాదం అని అంటున్నారు నిపుణులు…