Elaichi Tea : ఈ ఇలాచీ టీ తో ఎన్ని ప్రయోజనాలా… తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు..!
ప్రధానాంశాలు:
Elaichi Tea : ఈ ఇలాచీ టీ తో ఎన్ని ప్రయోజనాలా... తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు..!
Elaichi Tea : ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు టీ, కాఫీలతో రోజుని మొదలు పెడుతూ ఉంటారు. కొందరైతే దానిని తాగకపోతే ఏ పని మొదలుపెట్టారు. ఒక టీ కప్పు పడగానే అందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. దీనికి కారణం దానిలో ఉండే కెఫిన్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే ఇలాచి టీ చాలామంది తాగే ఉంటారు. యాలకులని ఇంగ్లీషులో ఇలాచి అంటారు. దీనిని మసాలా దినుసులలో కూడా వాడుతూ ఉంటారు. దీనిని కూరలలో కూడా వాడతారు. అలాగే స్వీట్స్ లో కూడా వినియోగిస్తారు. వంటలకి చక్కని రుచి వాసన అందించేది యాలకులే.. అయితే ఇది రుచిని మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా ప్రతిరోజు ఒక కప్పు ఇలాచీ టీ తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.. ప్రతిరోజు ఒక కప్పు ఇలాచీ టీ త్రాగితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు.. ఇలాచీ టీతో త్వరగా అలసట, తలనొప్పి, ఒత్తిడి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. సీజనల్ లో వచ్చే సమస్యలు కూడా దూరమవుతాయి. భోజనం చేసే గంట లేదా రెండు గంటల ముందు ఈ ఇలాచీ టీ తాగితే ఆరోగ్యానికి మంచిది. ప్రతిరోజు ఇలాచీ టీ తాగడం వల్ల మరో అద్భుతమైన ప్రయోజనం ఏంటంటే.. జీర్ణ సమస్యలు ముఖ్యంగా ఎసిడిటీ, మలబద్దకం, గ్యాస్ లాంటి సమస్యలు తగ్గుతాయి. గుండెపోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బులను నుండి కాపాడడంలో ఇలాచి టీ ఉపయోగపడుతుంది. కావున కచ్చితంగా ప్రతిరోజు ఒక కప్పు ఇలాచీ టీ తాగడం మాత్రం మర్చిపోకండి. అలాగే చాలామంది నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతుంటారు.
ఎన్నో రకాల మౌత్ వాసులు వాడిన టూత్ పేస్టులు మార్చిన ప్రయోజనం లేకపోవడం తో చాలా బాధపడుతూ ఉంటారు. అయితే అటువంటివారు రెగ్యులర్గా ఇలాచీ తాగితే ఖచ్చితంగా నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడవచ్చు. ఈరోజులలో ప్రతి ఒక్కరికి తలనొప్పి, అలసట, ఒత్తిడి లాంటి సమస్యలు సాధారణంగా వస్తూ ఉంటాయి. ఈ సమయంలో చాలామంది చేసే పని టక్కున ఏదో ఒక టాబ్లెట్లను వేసుకుంటూ ఉంటారు. అయితే అలా కాకుండా ఒక కప్పు ఇలాచీ టీ తాగితే గనుక త్వరగా ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే చలికాలంలో తరచూ జలుబులు, దగ్గు ,తుమ్ములు లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఇలాచీ టీ రోజుకు ఒక కప్పు తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు..