Vegetable Soup : ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో ఎంతో సతమతమవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.. ఈ బరువు తగ్గించుకోవడం కోసం చాలామంది ఆహారాన్ని పూర్తిగా మానేస్తూ ఉంటారు.. ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే అలాంటి అధిక బరువును ఈ ఆకుకూరల సూప్ తో ఎంతో ఈజీగా తగ్గించుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఆకుకూరలు తినని వాళ్ళు ఈ ఆకుకూరల సూఫ్ చేసుకుని తాగవచ్చు. అధిక బరువు కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు..
డీటాక్స్ గా పనిచేసే అధిక బరువు ఈజీగా తగ్గుతారు.. మరి ఆ సూప్ ఇప్పుడు మనం చూసేద్దాం..
ఈ సూప్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. ఈ సూప్ కి కావలసిన పదార్థాలు.. బ్రొకోలీ, వాటర్, ఆలివ్ ఆయిల్, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, తులసి ఆకులు, అల్లం, ఉప్పు, మిరియాలు, పాలకూర, మెంతికూర మొదలైనవి.. దీనిని తయారు చేసుకునే విధానం చూద్దాం… ఓ గిన్నెలో నీటిని పోసుకొని తరిగిన ఆకుకూరలని ఉప్పు వేసి మరిగించుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నెలో ఆలివ్ ఆయిల్ వేసి వెల్లుల్లి ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఉడకపెట్టిన కూరగాయల ఆకు కూరల మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి.
తర్వాత వెల్లుల్లి ఉల్లిపాయ వేసి ఫ్రై చేస్తున్న గిన్నెలు ఇవి వేసి బాగా కలుపుకోవాలి. ఇవి మరుగుతుండగా ఓ గిన్నెలో కొంచెం మొక్కజొన్న పిండి వేసి దాంట్లో పోసి కలిపిన దానిని కూడా ఈ సూప్ లో వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత సూప్ చిక్కగా తయారవుతుంది. ఆ తర్వాత సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి ఇక దింపే ముందు కొత్తిమీర తరుగు వేసి దింపుకోవాలి. అంతే ఎంతో ఈజీగా ఆకుకూరల సూప్ తయారవుతుంది.. ఈ ఆకుకూరల సూప్ లో యాంటీ ఆక్సిడెంట్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ కె, విటమిన్ సి ,పొటాషియం అధికంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సూప్ తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండడం వే కాకుండా ఫిట్గా తయారవుతారు. అలాగే అధిక బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు.. ఈ సూప్ ని ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ తాగడం వలన అధిక బరువు సమస్య ఈజీగా తగ్గించుకోవచ్చు…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.