Vegetable Soup : ఈ ఆకుకూరల సూప్ తో ఎంతటి అధిక బరువునైనా ఈజీగా తగ్గించుకోవచ్చు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vegetable Soup : ఈ ఆకుకూరల సూప్ తో ఎంతటి అధిక బరువునైనా ఈజీగా తగ్గించుకోవచ్చు…!

 Authored By aruna | The Telugu News | Updated on :24 July 2023,7:00 am

Vegetable Soup : ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో ఎంతో సతమతమవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.. ఈ బరువు తగ్గించుకోవడం కోసం చాలామంది ఆహారాన్ని పూర్తిగా మానేస్తూ ఉంటారు.. ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే అలాంటి అధిక బరువును ఈ ఆకుకూరల సూప్ తో ఎంతో ఈజీగా తగ్గించుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఆకుకూరలు తినని వాళ్ళు ఈ ఆకుకూరల సూఫ్ చేసుకుని తాగవచ్చు. అధిక బరువు కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు..

డీటాక్స్ గా పనిచేసే అధిక బరువు ఈజీగా తగ్గుతారు..  మరి ఆ సూప్ ఇప్పుడు మనం చూసేద్దాం..
ఈ సూప్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. ఈ సూప్ కి కావలసిన పదార్థాలు.. బ్రొకోలీ, వాటర్, ఆలివ్ ఆయిల్, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, తులసి ఆకులు, అల్లం, ఉప్పు, మిరియాలు, పాలకూర, మెంతికూర మొదలైనవి.. దీనిని తయారు చేసుకునే విధానం చూద్దాం… ఓ గిన్నెలో నీటిని పోసుకొని తరిగిన ఆకుకూరలని ఉప్పు వేసి మరిగించుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నెలో ఆలివ్ ఆయిల్ వేసి వెల్లుల్లి ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఉడకపెట్టిన కూరగాయల ఆకు కూరల మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి.

xcess weight easily with this vegetable soup

xcess weight easily with this vegetable soup

తర్వాత వెల్లుల్లి ఉల్లిపాయ వేసి ఫ్రై చేస్తున్న గిన్నెలు ఇవి వేసి బాగా కలుపుకోవాలి. ఇవి మరుగుతుండగా ఓ గిన్నెలో కొంచెం మొక్కజొన్న పిండి వేసి దాంట్లో పోసి కలిపిన దానిని కూడా ఈ సూప్ లో వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత సూప్ చిక్కగా తయారవుతుంది. ఆ తర్వాత సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి ఇక దింపే ముందు కొత్తిమీర తరుగు వేసి దింపుకోవాలి. అంతే ఎంతో ఈజీగా ఆకుకూరల సూప్ తయారవుతుంది.. ఈ ఆకుకూరల సూప్ లో యాంటీ ఆక్సిడెంట్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ కె, విటమిన్ సి ,పొటాషియం అధికంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సూప్ తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండడం వే కాకుండా ఫిట్గా తయారవుతారు. అలాగే అధిక బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు.. ఈ సూప్ ని ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ తాగడం వలన అధిక బరువు సమస్య ఈజీగా తగ్గించుకోవచ్చు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది