Fig Leaf : ఈ పండే కాదు… దీని ఆకుతో కూడా డయాబెటిస్ కి చెక్ పెట్టవచ్చు…!
ప్రధానాంశాలు:
Fig Leaf : ఈ పండే కాదు... దీని ఆకుతో కూడా డయాబెటిస్ కి చెక్ పెట్టవచ్చు...!
Fig Leaf : ప్రస్తుతం చాలామంది వయసు తరహా లేకుండా ఎన్నో వ్యాధుల బారినపడి సతమతమవుతున్నారు.. చాలామంది ఎక్కువగా వేధించే సమస్య మధుమేహం. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజుకి పెరుగుతుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో ఇన్సులిన్ ప్రభావంతమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడే ఎన్నో మందులు అందుబాటులోకి వచ్చాయి. కానీ వాటి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కావున ఎటువంటి ప్రమాదం లేకుండా సహజ పద్ధతిలో కూడా ఇన్సులిన్ ని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. ఇక దానికి అంజీర ఆకులు చాలా బాగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. అంజీర పండ్లు శరీరానికి ఎంత మేలు చేస్తాయో అన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్నో వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా అంజీర పండ్లను తింటే మంచిదని నిపుణులు సలహాలు ఇస్తూ ఉంటారు.
అంజీర్లో ఉండే మూలకాలు అనారోగ్య సమస్యలను నివారించడమే కాకుండా గుండె సంబంధిత ,మధుమేహం లాంటి వ్యాధులను కూడా తగ్గిస్తాయి. అంజీర పండ్లు మాత్రమే కాదు. వాటి ఆకులలో కూడా బోలెడే ఔషధ గుణాలు ఉన్నాయి. అంజిర ఆకులు మధుమేహానికి మెడిసిన్ల ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిలో ఉండే ఔషధ గుణాలు మలబద్ధక సమస్యలు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే గుండె సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. అంజీర ఆకులలో అపారమైన యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. ఇవి షుగర్ వ్యాధిగాస్తులకు చాలా మేలు చేస్తాయి. దీనికోసం ముందుగా నాలుగు నుంచి ఐదు అంజీర చెట్టు ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి.
తర్వాత ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉండగానే టీ లాగా తీసుకోవాలి. అలాగే అంజీర ఆకులను ఎండబెట్టి పొడి చేసిన తర్వాత కూడా దీనిని వినియోగించవచ్చు.. ఒక కప్పు నీటిలో వేసి టీ లాగా మరిగించి తీసుకోవాలి. దీనిని రెండు రకాలుగా మధుమేహానికి కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పొడి ఎముకలకు మంచి బలాన్ని చేకూరుస్తాయి. అంజీర ఆకులలో కాలుష్యం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల సాంద్రతను బలోపితం చేస్తాయి. గుండె జబ్బులతో ఇబ్బంది పడే వారికి ఈ అంజీర ఆకులు తీసుకోవడం వలన ఎంతో మేలు జరుగుతుంది. నిజానికి దాని ఆకులలో ఉండే ఒమేగా 3 ఒమేగా 6 గుండెను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే ఈ అంజీర ఆకులలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరం నుండి అధిక కొలెస్ట్రాలను కరిగిస్తుంది. అంజీరతోపాటు ఆప్రికాట్లు, బొప్పాయి ,నారింజ లాంటి పోషకాలు అధికంగా కలిగిన పండ్లను కూడా తీసుకుంటే డయాబెటిక్ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టవచ్చు…