Weight loss : లావుగా ఉన్నవారు ఈ ఐదు రకాల జ్యూస్ లను త్రాగారంటే నెల రోజుల్లో సన్నబడతారు ..!!
Weight loss : ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా చాలామంది అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. పరిమితికి మించి ఆహారం తీసుకోవడం, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడం వలన త్వరగా లావెక్కి పోతున్నారు. దీంతో సన్నబడడం కోసం రకరకాల డైట్లు ఫాలో అవుతూ, జిమ్ములు, వ్యాయామాలు చేస్తూ సన్నబడటానికి ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఎంత ట్రై చేసినా సన్నబడటానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు కొన్ని రకాల జ్యూస్లను తాగడం వలన కొద్ది రోజుల్లో సన్నబడతారాని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 1) పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో తినాలనే కోరిక తగ్గి తొందరగా బరువు తగ్గుతారు. ప్రతిరోజు ఉదయాన్నే పుచ్చకాయ జ్యూస్ ను త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.
2) కరివేపాకు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నిత్యం మనం తినే ఆహారంలో వాడుతూ ఉంటాం. అయితే కరివేపాకు కూరల్లో కాకుండా డైరెక్టుగా జ్యూస్ చేసుకుని తాగితే తొందరగా బరువు తగ్గుతారు. దీనికోసం గుప్పెడు కరివేపాకు గ్లాసు నీళ్లలో వేసి మరిగించుకోవాలి. ఇందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం వేసి కలిపి త్రాగడం వలన అధిక బరువును తగ్గించుకోవచ్చు. కరివేపాకులో ఉండే అమైనా ఆమ్లాలు పొట్టలోని కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. 3) ప్రతిరోజు ఉదయం టిఫిన్ కి బదులుగా బొప్పాయి జ్యూస్ తీసుకోవడం వలన అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.
బొప్పాయి లో ఉండే ఫైబర్ పొట్టలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.4) ప్రతిరోజు ఉదయాన్నే కాఫీకి బదులుగా గోధుమ గడ్డి జ్యూస్ త్రాగితే తొందరగా సన్నబడవచ్చు. గోధుమ గడ్డిని ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. దీనిని తరచూ తీసుకోవడం వలన శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్ళిపోయి త్వరగా సన్నబడతారు. 5) బీట్రూట్, క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు ఉదయాన్నే టిఫిన్ సమయంలో ఒక బీట్రూట్, రెండు క్యారెట్లు కలిపి జ్యూస్ లా తయారు చేసుకుని త్రాగాలి. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, ఫైబర్ అధిక బరువును తొందరగా తగ్గించడానికి సహాయపడతాయి.