ప్రస్తుత కాలంలో చాలా మందికి సంతానం లేక ఎంతో బాధపడుతున్నారు. అయితే సంతాన ఉత్పత్తిని మెరుగుపరచడానికి పోషకాహారాలు ముఖ్యపాత్ర వహిస్తాయి. ఈ పునరుత్పత్తి ఆరోగ్య విషయంలో అధికంగా మహిళల గురించే మాట్లాడతారు. కానీ సంతాన ఉత్పత్తి విషయంలో పురుషుల పాత్ర కూడా ఎంతో కీలకమైనది. అందువల్ల పురుషుల సంతాన ఉత్పత్తిని ప్రభావితం చేసి స్పెర్మ్ కౌంట్ ను పెంచే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. ఆ పోషకాహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
వాల్ నట్స్ లో అధికంగా ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు, ఫోలేట్ వీర్యకణాల వృద్ధికి ఎంతగానో మేలు చేస్తాయి అని నిపుణులు అంటున్నారు. అలాగే బాదంపప్పులో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు తో పాటుగా జింక్, సెలినియం, విటమిన్ ఇ ఇతర పోషకాలు కూడా ఉంటాయి అని తెలిపారు. మీరు తీసుకునే రోజు వారి ఆహారంలో ఈ బాదం పప్పును గనుక చేర్చుకున్నట్లైతే స్పెర్మ్ కౌంటు ను దెబ్బతినకుండా ఎంతగానో రక్షిస్తుంది. అలాగే బ్రెజిల్ నట్స్ తో వీర్యకణాల వృద్ధితోపాటు ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది అని తెలిపారు. దీనిలో ఉండే సెలీనియం అనేది స్మెర్మ్ కౌంటును ఎంతగానో మెరుగుపరుస్తుంది అని తెలిపారు. ప్రతి ఒక్కరి వంట గదిలో కనిపించే టమాటాలతో కూడా వీర్యకణాలు వృద్ధి చేసుకోవచ్చు అని చెబుతున్నారు.
దీనిలో లైకోఫిన్ అనేది అధికంగా ఉంటుంది. మీరు గనక ప్రతిరోజు రెండు లేక మూడు టమాటల గుజ్జును తీసుకుంటే స్పెర్మ్ నాణ్యత ఎంతో మెరుగుపడుతుంది అని తెలిపారు. మీరు మాంసాహారులు అయితే సి ఫుడ్స్ ప్రతినిత్యం తీసుకోవడం వలన వీర్యపుష్టి అనేది ఎంతో బాగా పెరుగుతుంది అంట. అలాగే సముద్రంలో ఉండే రొయ్యలు,చేపలు లాంటి వాటిలో కూడా ఓమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు తో పాటు ఇతర పోషకాలు అనేవి అధికంగా ఉన్నాయి అని తెలిపారు.
ఆకుకూరలు మరియు ఆకుపచ్చని కూరగాయలలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ సెల్యులార్ దెబ్బతినకుండా ఎంతో రక్షిస్తుంది అని, వీర్య కణాల కదిలికలను ఎంతో చురుగ్గా ఉంచుతుంది అని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అయితే గుమ్మడి గింజలలో ఉండే ఫైటో స్టెరాల్ కు టెస్టోస్టెరాల్ స్థాయి లను పెంచే గుణం కలిగి ఉన్నది అని అంటున్నారు. అయితే పురుషుల్లో ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ వలన స్పెర్మ్ నాణ్యత అనేది ఎంతగానో పెరుగుతుందని తెలియజేశారు. అయితే ఈ స్పెర్మ్ కదలికలను మెరుగుపరిచేందుకు విటమిన్ సి ఎంతో సహాయం చేస్తుంది. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను ప్రతిరోజు తీసుకోవాలి అని వైద్యులు చెబుతున్నారు…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.