Foods : ఈ ఆహార పదార్థాలు పురుషులకే బ్రహ్మాస్త్రాలు… వీటితో ఆ సమస్యలన్ని పరార్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Foods : ఈ ఆహార పదార్థాలు పురుషులకే బ్రహ్మాస్త్రాలు… వీటితో ఆ సమస్యలన్ని పరార్…!

ప్రస్తుత కాలంలో చాలా మందికి సంతానం లేక ఎంతో బాధపడుతున్నారు. అయితే సంతాన ఉత్పత్తిని మెరుగుపరచడానికి పోషకాహారాలు ముఖ్యపాత్ర వహిస్తాయి. ఈ పునరుత్పత్తి ఆరోగ్య విషయంలో అధికంగా మహిళల గురించే మాట్లాడతారు. కానీ సంతాన ఉత్పత్తి విషయంలో పురుషుల పాత్ర కూడా ఎంతో కీలకమైనది. అందువల్ల పురుషుల సంతాన ఉత్పత్తిని ప్రభావితం చేసి స్పెర్మ్ కౌంట్ ను పెంచే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. ఆ పోషకాహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం… […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2024,1:00 pm

ప్రస్తుత కాలంలో చాలా మందికి సంతానం లేక ఎంతో బాధపడుతున్నారు. అయితే సంతాన ఉత్పత్తిని మెరుగుపరచడానికి పోషకాహారాలు ముఖ్యపాత్ర వహిస్తాయి. ఈ పునరుత్పత్తి ఆరోగ్య విషయంలో అధికంగా మహిళల గురించే మాట్లాడతారు. కానీ సంతాన ఉత్పత్తి విషయంలో పురుషుల పాత్ర కూడా ఎంతో కీలకమైనది. అందువల్ల పురుషుల సంతాన ఉత్పత్తిని ప్రభావితం చేసి స్పెర్మ్ కౌంట్ ను పెంచే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. ఆ పోషకాహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

వాల్ నట్స్ లో అధికంగా ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు, ఫోలేట్ వీర్యకణాల వృద్ధికి ఎంతగానో మేలు చేస్తాయి అని నిపుణులు అంటున్నారు. అలాగే బాదంపప్పులో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు తో పాటుగా జింక్, సెలినియం, విటమిన్ ఇ ఇతర పోషకాలు కూడా ఉంటాయి అని తెలిపారు. మీరు తీసుకునే రోజు వారి ఆహారంలో ఈ బాదం పప్పును గనుక చేర్చుకున్నట్లైతే స్పెర్మ్ కౌంటు ను దెబ్బతినకుండా ఎంతగానో రక్షిస్తుంది. అలాగే బ్రెజిల్ నట్స్ తో వీర్యకణాల వృద్ధితోపాటు ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది అని తెలిపారు. దీనిలో ఉండే సెలీనియం అనేది స్మెర్మ్ కౌంటును ఎంతగానో మెరుగుపరుస్తుంది అని తెలిపారు. ప్రతి ఒక్కరి వంట గదిలో కనిపించే టమాటాలతో కూడా వీర్యకణాలు వృద్ధి చేసుకోవచ్చు అని చెబుతున్నారు.

దీనిలో లైకోఫిన్ అనేది అధికంగా ఉంటుంది. మీరు గనక ప్రతిరోజు రెండు లేక మూడు టమాటల గుజ్జును తీసుకుంటే స్పెర్మ్ నాణ్యత ఎంతో మెరుగుపడుతుంది అని తెలిపారు. మీరు మాంసాహారులు అయితే సి ఫుడ్స్ ప్రతినిత్యం తీసుకోవడం వలన వీర్యపుష్టి అనేది ఎంతో బాగా పెరుగుతుంది అంట. అలాగే సముద్రంలో ఉండే రొయ్యలు,చేపలు లాంటి వాటిలో కూడా ఓమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు తో పాటు ఇతర పోషకాలు అనేవి అధికంగా ఉన్నాయి అని తెలిపారు.

Foods ఈ ఆహార పదార్థాలు పురుషులకే బ్రహ్మాస్త్రాలు వీటితో ఆ సమస్యలన్ని పరార్

Foods : ఈ ఆహార పదార్థాలు పురుషులకే బ్రహ్మాస్త్రాలు… వీటితో ఆ సమస్యలన్ని పరార్…!

ఆకుకూరలు మరియు ఆకుపచ్చని కూరగాయలలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ సెల్యులార్ దెబ్బతినకుండా ఎంతో రక్షిస్తుంది అని, వీర్య కణాల కదిలికలను ఎంతో చురుగ్గా ఉంచుతుంది అని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అయితే గుమ్మడి గింజలలో ఉండే ఫైటో స్టెరాల్ కు టెస్టోస్టెరాల్ స్థాయి లను పెంచే గుణం కలిగి ఉన్నది అని అంటున్నారు. అయితే పురుషుల్లో ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ వలన స్పెర్మ్ నాణ్యత అనేది ఎంతగానో పెరుగుతుందని తెలియజేశారు. అయితే ఈ స్పెర్మ్ కదలికలను మెరుగుపరిచేందుకు విటమిన్ సి ఎంతో సహాయం చేస్తుంది. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను ప్రతిరోజు తీసుకోవాలి అని వైద్యులు చెబుతున్నారు…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది