Diabetes : తీపి అనే ప్రతి మాటలో కొన్ని సందర్భాల్లో తీపికబురు ఉండకపోవచ్చు. దానికి ఉదాహరణ మధుమేహం. పేరుకే షుగర్ అనేది తీపి జబ్బు. అది తెచ్చిపెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక్కసారి ఈ మధుమేహం బారిన పడితే ఇక ఒళ్లంతా గుల్లైపోతుంది. మధుమేహంతో బాధపడే రోగులు ఖచ్చితంగా ఆహార నియమాలను పాటించి తీరాలి. అప్పుడే వారి ఆరోగ్యం బాగుంటుంది. డయాబెటిస్ ఉన్నవారు డైట్‌లో కచ్చితంగా మార్పులు చేసుకోవాలి. కొంతమంది పండ్లు తీపిగా ఉంటాయని మానేస్తారు.. అదే వారు చేసే తప్పు. ఘుగర్ వ్యాధి ఉన్న వారు కచ్చితంగా పండ్లు తినాలి. ఇక డయాబెటిస్ ఉన్నవారు తినాల్సిన పండ్లు ఏమిటో తెలుసుకుందాం..
1. దానిమ్మ పండు : దానిమ్మ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒక పండులో దాదాపుగా 7 గ్రాముల మేర ఫైబర్ లభిస్తుంది. అలాగే ఈ పండ్లలో 3 రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు రోజుకు ఒక దానిమ్మ పండును తినడం అలవాటు చేసుకుంటే మేలు జరుగుతుంది.
2. ద్రాక్షలు : రోజూ ఒక కప్పు మోతాదులో ద్రాక్షలను తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. దీంతోపాటు షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.
3. అరటి పండ్లు : షుగర్ ఉన్నవారు అరటి పండ్లను తినాలంటే సందేహిస్తుంటారు. కానీ రోజుకు ఒక అరటి పండును వారు తినవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ పెద్దగా పెరగవు. అయితే మరీ బాగా పండిన అరటి పండ్లను మాత్రం తినవద్దు. వాటిల్లో చక్కెర అధికంగా ఉంటుంది. ఒక మోస్తరుగా పండిన.. మచ్చలు లేని అరటి పండ్లను డయాబెటిస్ ఉన్నవారు నిర్భయంగా తినవచ్చు. దీని వల్ల శరీరానికి పొటాషియం, ఫైబర్ లభిస్తాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి.
4. నారింజ : డయాబెటిస్ ఉన్నవారు రోజుకు ఒక నారింజ పండును కూడా నిర్భయంగా తినవచ్చు. ఈ పండులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో సహాయం చేస్తుంది. నారింజ పండ్లలో ఉండే సెలీనియం షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది.
5. స్ట్రాబెర్రీలు : షుగర్ ఉన్నవారు తినాల్సిన పండ్లలో స్ట్రాబెర్రీలు ఒకటి. రోజుకు 3, 4 స్ట్రాబెర్రీ పండ్లను తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. వీటిల్లో ఉండే విటమిన్ సి షుగర్ లెవల్స్ ను తగ్గించేందుకు సహాయ పడుతుంది.
6.జామకాయ: జామకాయలో అధికశాతంలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి, ఫైబర్ ఉండటం వల్ల జామకాయ మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
7. ఆపిల్స్: ఆపిల్స్ లో కూడా అధిక శాతంలో యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. జీర్ణవ్యవస్థకు బాగా సహాయపడుతుంది. శరీరంలో అన్ని జీవక్రియలు క్రమంగా పనిచేసేలా చేస్తాయి.
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
This website uses cookies.