Diabetes : మీకు షుగ‌ర్ ఉందా..? మధుమేహం ఉన్న వాళ్లు తినాల్సిన 7 పండ్లుఇవే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : మీకు షుగ‌ర్ ఉందా..? మధుమేహం ఉన్న వాళ్లు తినాల్సిన 7 పండ్లుఇవే..!

Diabetes : తీపి అనే ప్రతి మాటలో కొన్ని సందర్భాల్లో తీపికబురు ఉండకపోవచ్చు. దానికి ఉదాహరణ మధుమేహం. పేరుకే షుగర్ అనేది తీపి జబ్బు. అది తెచ్చిపెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక్కసారి ఈ మధుమేహం బారిన పడితే ఇక ఒళ్లంతా గుల్లైపోతుంది. మధుమేహంతో బాధపడే రోగులు ఖచ్చితంగా ఆహార నియమాలను పాటించి తీరాలి. అప్పుడే వారి ఆరోగ్యం బాగుంటుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారు డైట్‌లో క‌చ్చితంగా మార్పులు చేసుకోవాలి. కొంతమంది పండ్లు తీపిగా ఉంటాయని మానేస్తారు.. […]

 Authored By pavan | The Telugu News | Updated on :7 February 2022,6:00 am

Diabetes : తీపి అనే ప్రతి మాటలో కొన్ని సందర్భాల్లో తీపికబురు ఉండకపోవచ్చు. దానికి ఉదాహరణ మధుమేహం. పేరుకే షుగర్ అనేది తీపి జబ్బు. అది తెచ్చిపెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక్కసారి ఈ మధుమేహం బారిన పడితే ఇక ఒళ్లంతా గుల్లైపోతుంది. మధుమేహంతో బాధపడే రోగులు ఖచ్చితంగా ఆహార నియమాలను పాటించి తీరాలి. అప్పుడే వారి ఆరోగ్యం బాగుంటుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారు డైట్‌లో క‌చ్చితంగా మార్పులు చేసుకోవాలి. కొంతమంది పండ్లు తీపిగా ఉంటాయని మానేస్తారు.. అదే వారు చేసే తప్పు. ఘుగర్ వ్యాధి ఉన్న వారు కచ్చితంగా పండ్లు తినాలి. ఇక డ‌యాబెటిస్ ఉన్న‌వారు తినాల్సిన పండ్లు ఏమిటో తెలుసుకుందాం..

fruits to eat while you suffering from Diabetes

fruits to eat while you suffering from Diabetes

1. దానిమ్మ పండు : దానిమ్మ పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఒక పండులో దాదాపుగా 7 గ్రాముల మేర ఫైబ‌ర్ ల‌భిస్తుంది. అలాగే ఈ పండ్లలో 3 ర‌కాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తుంది. క‌నుక డ‌యాబెటిస్ ఉన్న‌వారు రోజుకు ఒక దానిమ్మ పండును తిన‌డం అల‌వాటు చేసుకుంటే మేలు జ‌రుగుతుంది.

2. ద్రాక్ష‌లు : రోజూ ఒక క‌ప్పు మోతాదులో ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. దీంతోపాటు షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా త‌గ్గుతాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె జ‌బ్బులు రాకుండా చూస్తాయి.

3. అర‌టి పండ్లు : షుగ‌ర్ ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తినాలంటే సందేహిస్తుంటారు. కానీ రోజుకు ఒక అర‌టి పండును వారు తిన‌వ‌చ్చు. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ పెద్ద‌గా పెర‌గ‌వు. అయితే మ‌రీ బాగా పండిన అర‌టి పండ్ల‌ను మాత్రం తిన‌వద్దు. వాటిల్లో చ‌క్కెర అధికంగా ఉంటుంది. ఒక మోస్త‌రుగా పండిన‌.. మ‌చ్చ‌లు లేని అర‌టి పండ్ల‌ను డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు. దీని వ‌ల్ల శ‌రీరానికి పొటాషియం, ఫైబర్ ల‌భిస్తాయి. ఇవి షుగ‌ర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి.

4. నారింజ : డ‌యాబెటిస్ ఉన్న‌వారు రోజుకు ఒక నారింజ పండును కూడా నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు. ఈ పండులో ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క శక్తిని పెంచ‌డంతోపాటు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌డంలో స‌హాయం చేస్తుంది. నారింజ పండ్ల‌లో ఉండే సెలీనియం షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తుంది.

5. స్ట్రాబెర్రీలు : షుగ‌ర్ ఉన్న‌వారు తినాల్సిన పండ్ల‌లో స్ట్రాబెర్రీలు ఒక‌టి. రోజుకు 3, 4 స్ట్రాబెర్రీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. వీటిల్లో ఉండే విట‌మిన్ సి షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించేందుకు స‌హాయ ప‌డుతుంది.

6.జామకాయ: జామకాయలో అధికశాతంలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి, ఫైబర్ ఉండటం వల్ల జామకాయ మధుమేహాన్ని నియంత్రిస్తుంది.

7. ఆపిల్స్: ఆపిల్స్ లో కూడా అధిక శాతంలో యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. జీర్ణవ్యవస్థకు బాగా సహాయపడుతుంది. శరీరంలో అన్ని జీవక్రియలు క్రమంగా పనిచేసేలా చేస్తాయి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది