Zodiac Signs : ఫిబ్రవరి 07 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేషరాశి ఫలాలు : కొంచెం అనుకూలం, కొంచెం ప్రతికూలం. ఆర్థిక విషయాలలో ఇబ్బందులు. పనులలో జాప్యం కలుగుతుంది. అన్రి రంగాల వారికి శ్రమ పెరుగుతుంది. మహిళలకు గందరగోళంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అనుకున్నవి అనుకున్నట్లుగా సాధిస్తారు. విజయాల పరంపర కొనసాగుతుంది. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు గట్టెక్కుతారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మహిళలకు సంతోషకరమైన వార్తలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మిధునరాశి ఫలాలు : చక్కటి ఆనందంతో కూడిన రోజు ఇది. అనుకున్నదానికంటే ఎక్కువ లాభాల గడిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినిస్తాయి. శని గ్రహారాధన, శివాభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.
కర్కాటకరాశి ఫలాలు : ఆటంకాలతో పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరమైన అంశాలలో ఇబ్బందులు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్య భంగం.మహిళలకు వివాదాలకు అవకాశం ఉంది. శ్రీశివారాధన, అభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.

Today Horoscope february 07 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈరోజు. అనుకోని వివాదాలతో మనఃశాంతి కరవువౌతుంది. పని భారం పెరుగుతుది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. మహిళలకు చికాకులు అధికమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. శ్రీ శివకవచం చదువుకోండి లేదా దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

కన్యారాశి ఫలాలు : ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్తితులు చక్కబడుతాయి. ఆనుకోని లాబాలు గడిస్తారు. కొత్త వస్తువులు, బంగారు నగలు కొనుగోలుకు అవకాశం కనిపిస్తుంది. మహిళలక శుభవార్తలు అందుతాయి. శ్రీగణపతి ఆరాధన చక్కటి ఫలితాలను ఇస్తుంది.

తులారాశి ఫలాలు : ప్రశాంతమైన రోజు. కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్తితి సంతోషకరంగా ఉంటుంది. శుభకార్య యోచన. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. చాలా కాలంగా వసూలు కాని బాకీలు వసూలు అవుతాయి. అమ్మవారి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి ఈ రోజు. మీరు చేసే వృత్తి వ్యాపారాలలో నెమ్మదితనం లేదా మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. మహిళలకు చికాకులు. పక్కవారితో విభేదాలు. శ్రీవిష్ణు సహస్రనామాలను, లక్ష్మీ అష్టోతరం చదువుకోండి…

ధనుస్సురాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరిస్తితి అంత అనుకూలం కాదు. కుటుంబంలో కలహాలక అవకాశం. ఓపికతో ముందుకుపోవాల్సిన రోజు. విద్యార్థులు, ఉద్యోగులకు కొంచెం శ్రమించాల్సిన రోజు. మహిళలకు ఇబ్బందికరంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయండి.

మకరరాశి ఫలాలు : అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కీలకమైన విషయాలలో పెద్దల సలహాలతో ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్తితి బాగుంటుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలు తీరుతాయి. శ్రీగాయత్రీదేవి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : సమస్యలు రావచ్చు. ఆర్థిక ఇబ్బంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. అనుకోని నష్టాలు వస్తాయి. కుటుంబంలో సమస్యలు. విద్యార్థులకు బాగా శ్రమించాల్సిన రోజు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీశివాభిషేకం చేయించుకోండి మంచి ఫలితాలు.

మీనరాశి ఫలాలు : చాలా రోజులుగా పడుతున్న ఇబ్బందులు తీరుతాయి. అనారోగ్య సమస్యలు తీరుతాయి. విందలు, వినోదాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి. అన్ని రకాల వృత్తులు, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

6 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

7 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

9 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

10 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

11 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

12 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

13 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

13 hours ago