Garlic and Honey : మీరు ప్రతిరోజు పరగడుపున ఇది తినండి… మీకు అనారోగ్యమే రాదు… ఏమిటది…?
ప్రధానాంశాలు:
Garlic and Honey : మీరు ప్రతిరోజు పరగడుపున ఇది తినండి... మీకు అనారోగ్యమే రాదు... ఏమిటది...?
Garlic and Honey : ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తమ బిజీ లైఫ్ లో ఆహారపు అలవాట్లు గురించి శ్రద్ధ పెట్టడం లేదు. తరచూ అనారోగ్య సమస్యకు గురవుతున్నారు. మనం ఆరోగ్యంగా ఉండడానికి ఇంట్లోనే తేలిగ్గా ఈ చిట్కాని పాటించి చూడండి. ఆ చిక్క ఏమిటంటే… వెల్లుల్లి మరియు తేనె… చాలామందికి వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు మరియు తేనె యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసు.. కానీ తేనె మరియు వెల్లుల్లి కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి కొంతమందికి తెలియదు. తేనె మరియు వెల్లుల్లిని కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే మాత్రం మీరు కూడా తప్పకుండా తీసుకుంటారు… వెల్లుల్లి మరియు తేనె రెండు సూపర్ ఫుడ్స్. రెండిటిలోనూ కూడా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ శరీరాన్ని అంటువ్యాధులు సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. అయితే వెల్లుల్లిలో విటమిన్లు, ఎ,బి,సి,డి, కె, నియాసిస్ మరియు ఫొల్లెట్, సెలీనియం, పొటాషియం, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే తేనెలో విటమిన్, ఏ, బి, సి, నియాసిన్, క్యాల్షియం, రాగి, ఇనుము,మెగ్నీషియం,యాంటీ ఆక్సిడెంట్ లో అధికంగా ఉంటాయి. అన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ ఈ వెల్లుల్లి తేనెను కలిపి తీసుకుంటే మీ ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి. మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. త్రీవ్రవమైన సమస్యల నుండి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అదేవిధంగా వెల్లుల్లి, తేనెను కలిపి తీసుకుంటే శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు దీన్ని తింటే శరీరానికి ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం….

Garlic and Honey : మీరు ప్రతిరోజు పరగడుపున ఇది తినండి… మీకు అనారోగ్యమే రాదు… ఏమిటది…?
Garlic and Honey వెల్లుల్లి, తేనెను ఎలా తీసుకోవాలి…?
రాత్రి నిద్రించే సమయం ముందు కొద్దిసేపు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఈ వెల్లుల్లిని నలిపి మెత్తగా చేయాలి, ఆ తరువాత వెళ్ళినలో కొన్ని చుక్కల తేనెను కలిపి నీటిలో వేసి ఆ తర్వాత తినండి. ఈ మిశ్రమం శరీరాన్ని బాగా బలపరుస్తుంది.
పేగును ఆరోగ్యంగా ఉంచుతుంది : రాత్రి పడుకునే ముందు వెల్లుల్లిని మరియు తేనెను కలిపి తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మిశ్రమం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అప్పులో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా నివారించబడతాయి. వెల్లుల్లి మరియు తేనెను కలిపినా ఈ మిశ్రమం కడుపునొప్పి, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలను కూడా పులిస్టాప్ పెట్టవచ్చు.
ఆరోగ్యమైన చర్మం : ఈ మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలోని టాక్సిన్ లను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మం సహజమైన మెరుపును ఇస్తుంది. అంతేకాదు ఈ మిశ్రమం వలన అనేక చర్మ సంబంధిత సమస్యలు కూడా నివారించబడతాయి.
కొలెస్ట్రాల్ : ఈ వెల్లుల్లి మరియు తేనె మిశ్రమాన్ని కలిపి తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ కూడా కరిగించవేయబడుతుంది. ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అందుకే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
శరీర వాపు : వెల్లుల్లి మరియు తేనెను కలిపి తినడం వల్ల శరీర వాపు సమస్య కూడా నివారించబడుతుంది. ఈ మిశ్రమంలో యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు కనిపిస్తాయి. ఇది కీళ్ల నొప్పులు, వాపు సమస్యలను కూడా తగ్గిస్తుంది.
రోగ నిరోధక శక్తి : రాత్రి నిద్రపోయే ముందు వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తినడం ద్వారా మీరు అనేక కాలానుగుణ వ్యాధులను నుండి మరియు అంటువ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఈ మిశ్రమంలో యాంటీ బయాటిక్, యాంటీ బ్యాక్టీరియల్, ఆంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. కావున శరీరంలో రోగ నిరోధక శక్తిని బలపరిచే తరచూ అనారోగ్యం పాలవకుండా కాపాడుతుంది.
ఈ వెల్లుల్లి,తేనెను ఎవరు తీసుకోకూడదు :
వెల్లుల్లి మరియు తేనె మిశ్రమం శరీరానికి చాలా ప్రయోజనకరమైనది. కానీ కొందరికి మాత్రం ఇది అంత మంచిది కాదు. మీరు రక్తాన్ని పల్చన చేసే మందులు తీసుకుంటే లేదా రక్తం సంబంధిత ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే ఈ మిశ్రమాన్ని తీసుకోండి. వెల్లుల్లి, తేనే తిన్న తర్వాత మీకు ఏదైనా ఎలర్జీ వస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి.
వెల్లుల్లి, తేనె మిశ్రమం బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. వండిన వెల్లుల్లి కంటే పచ్చి వెల్లుల్లితో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇది జీర్ణ క్రియను పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. దీని ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా ఇట్లే కరిగిపోతుంది. పంటలలో వినియోగించిన వెల్లుల్లి కంటే, వచ్చి వెల్లుల్లి రాత్రి నిద్రించే సమయంలో తింటే మాత్రం ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. దీనివల్ల గుండె జబ్బులు కూడా తగ్గుతాయి