
Gongura : వారంలో మూడుసార్లు గోంగూరను తింటే చాలు ... ఈ సమస్యలన్నీ మటుమాయం...!
Gongura : గోంగూర ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ గోంగూరలో విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కెరోటిన్ అధికంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన శరీరానికి కావలసిన విటమిన్ సి 53 శాతం ఈ గోంగూర లో ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతుంది. కాబట్టి వారంలో రెండు సార్లు అయినా ఈ గోంగూరని తీసుకుంటే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ గోంగూర పూలను దంచి దాని నుండి రసం తీసి దానిని వడకట్టుకొని దానిలో ఒక అరకప్పు వరకు పాలు పోసుకొని ఉదయం సాయంత్రం రెండు పూటలా తాగితే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఈ గోంగూర ఆకుల పేస్ట్ ను తలకి అప్లై చేసుకొని కొంత సమయం తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయటం వలన చుండ్రు సమస్యలు మరియు జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది.
ఈ గోంగూరలో పొటాషియం మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉన్నాయి. దీనిని తీసుకోవడం వలన హై బీపీని నియంత్రించవచ్చు. అలాగే ఈ గోంగూరను వారంలో మూడు నాలుగు సార్లు తీసుకున్నట్లయితే హై బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే దగ్గు మరియు ఆయాసం, తుమ్ములతో బాధపడే వారు కూడా గోంగూరను తీసుకోవటం వలన ఉపశమనం కలుగుతుంది. ఈ సమస్యలతో బాధపడేవారు గోంగూరను తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. గోంగూరలో ఉన్నటువంటి క్లోరోఫిల్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అదుపులో ఉంచుతుంది. అందువలన ఈ గోంగూరను ప్రతి ఒక్కరూ సంతోషంగా తినొచ్చు. అంతేకాక ఈ గోంగూర పులిహోర లాగా చేసుకుని కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ గోంగూర నుండి తీసినటువంటి జిగురును నీటిలో కలుపుకొని తాగితే విరోచనాలు కూడా తగ్గుతాయి.
Gongura : వారంలో మూడుసార్లు గోంగూరను తింటే చాలు … ఈ సమస్యలన్నీ మటుమాయం…!
మహిళలకు పీరియడ్స్ టైం లో కాళ్లు లాగటం, నడుము నొప్పి లాంటి సమస్యలతో ఎంతో ఇబ్బంది పడతారు.అలాగే ఎంతో నీరసంగా కూడా ఉంటారు. ఈ తరుణంలో ఈ గోంగూర ను తీసుకోవటం వలన శరీరానికి కావలసిన శక్తి అనేది వస్తుంది. అలాగే ఎముకలను దృఢంగా ఉంచటం లో మరియు విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేయడంలో ఈ గోంగూర ముఖ్య పాత్ర వహిస్తుంది. అయితే ఈ గోంగూరలో ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. దీనిని తీసుకోవటం వలన ఎముకలు అనేవి ఎంతో దృఢంగా తయారవుతాయి. అంతేకాక ఈ గోంగూరను తీసుకోవటం వలన జుట్టు ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. దీని వలన డ్యామేజ్ అయినటువంటి జుట్టు కూడా ఎంతో నిగనిగలాడుతుంది…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.