Formers : రైతులకు శుభవార్త… ట్రాక్టర్ కొనేవారికి 25 లక్షల లోన్…!
ప్రధానాంశాలు:
Formers : రైతులకు శుభవార్త... ట్రాక్టర్ కొనేవారికి 25 లక్షల లోన్...
Formers : ఒకప్పుడు రైతులు వ్యవసాయం చేయాలి అంటే తప్పనిసరిగా ఎడ్లు ఉండి తినాల్సిందే. పొలాన్ని దున్న టం దగ్గర నుండి పండిన పంటను ఇంటికి చేర్చే వరకు కూడా అన్ని పనులను కూడా ఎద్దుల బండి ద్వారా పూర్తి చేసుకునే వారు. కానీ తరువాత నెమ్మదిగా ఈ ఎడ్ల బండి స్థానంలోనికి ఇతర పనిముట్లు అనేవి వచ్చాయి. ప్రస్తుతం వ్యవసాయం చేయాలి అంటే తప్పనిసరిగా ట్రాక్టర్ అనేది ఉండి తీరాల్సిందే. పొలం దున్నటం దగ్గర నుండి పంటను ఇంటికి చేర్చే వరకు కూడా ప్రతి పనికి కూడా ట్రాక్టర్ అనేది ఉండి తీరాల్సిందే. గత 5,6 ఏళ్ల నుండి గ్రామాలలో ట్రాక్టర్ల సంఖ్య అనేది నానాజీకి బాగా పెరిగింది. 5 నుండి 10 ఎకరాల పొలం ఉన్నటువంటి వారు ట్రాక్టర్లను కొంటున్నారు. దీనితో పాటు పనులకు అవసరమయ్యే పనిముట్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. మరి మీరు కూడా టాక్టర్ ను కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నారా. అయితే డబ్బులు లేక ఆగరా. అయితే SBI మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. మీకు ఏకంగా రూ.25 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులలో రెండవ అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు అదిరే స్కీమ్ ఒకటి తెచ్చింది. దీని వలన ట్రాక్టర్లు కొనాలి అని అనుకునే వారికి రూ.25 లక్షల వరకు లోన్ అనేది అందిస్తుంది. మెడిఫైడ్ న్యూ ట్రాక్టర్ స్కీమ్ కింద ఈ రుణం అనేది ఇస్తున్నారు. దీని వలన రైతులు ట్రాక్టర్ ఇతర వ్యవసాయ పనిముట్లు మరియు పరికరాలు కొన వచ్చు. ఇక ఈ లోర్ లో భాగంగా ట్రాక్టర్ ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు అన్నింటిని కలిపి లోన్ అనేది ఇవ్వనున్నారు. SBI అగ్రికల్చర్ టర్మ్ లోన్ కింద ఈ సదుపాయం అనేది కల్పించింది. దీని వలన మీరు కనిష్టంగా రెండు లక్షల నుండి గరిష్టంగా 25 లక్షల వరకు కూడా మీరు ఈ లోన్ అనేది పొందవచ్చు..
ఆరు నెలలకి ఒకసారి EMI
ట్రాక్టర్ కొనడం కోసం లోన్ తీసుకున్న వారు ప్రతి నెల కూడా EMI అనేది కట్టాల్సిన అవసరం లేదు. ఆరు నెలలకు ఒకసారి EMI అనేది చెల్లిస్తే చాలు. అయితే ఈ ట్రాక్టర్ లోన్ పొందాలి అంటే పొలం లేక బంగారం తాకట్టు పెట్టాలి. రైతులు ఎవరైనా సరే ఈ ట్రాక్టర్ లోన్ ను పొందవచ్చు. దీనికి కనీసం రెండు ఎకరాల పొలం ఉండి తీరాల్సిందే. సిబిల్ స్కోర్ 650 కి పైనే ఉండాలి. మీకు దగ్గరలో ఉన్నటువంటి SBI బ్యాంక్ దగ్గరకు వెళ్ళండి. అక్కడ దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకోండి. ఈ లోన్ పొందాలి అంటే. ఆధార్ కార్డు, పాన్ కార్డు,ల్యాండ్ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది.
అయితే SBI అందిస్తున్న ఈ లోన్ మీద ఎంసీఎల్ఆర్ కు 3.3% ఎక్కువ వడ్డీ అనేది పడింది. ఇక ప్రాసెసింగ్ ఫీజు, చార్జీలు విషయానికి వచ్చినట్లయితే రెండు లక్షల వరకు కూడా లోన్ తీసుకున్నట్లయితే ఎటువంటి చార్జీలు అనేవి ఉండవు. ఆ పైన లోన్ మొత్తం మీద 1.4% చార్జీలు అనేవి వసూలు చేస్తారు. ఈ లోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే మాత్రం మీకు దగ్గరలో ఉన్న SBI బ్యాంకుకు వెళ్లి అధికారులను సంప్రదించాలి. అలాగే SBI మాత్రమే కాక ఇతర బ్యాంకులు కూడా ట్రాక్టర్ లోన్ లు అందిస్తాయి. అందుకే ఏ బ్యాంకులో తక్కువ ఇంట్రెస్ట్ తో వసూలు చేస్తున్నారో తెలుసుకొని దాని ఆధారంగా లోన్ ను తీసుకోవడం ఎంతో మంచిది అని అంటున్నారు…