Tamarind Tree : చింత చెట్టు ఆకులతో కూడా జుట్టు సమస్యలను తగ్గించవచ్చు… ఎలాగంటే…?
Tamarind Tree: చింత చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చింత చిగురు మరియు చింతపండు వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే చింత చిగురు లో కూడా ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. అందుకే పెద్దవాళ్లు చింత చిగురుతో కూడా ఆహారాలు తయారు చేసి మరీ మనకు పెడుతూ ఉంటారు. అయితే ఇప్పటికీ కూడా చింత చిగురుతో గ్రామాలలో వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. వీటితో చేసిన వంటలు ఎంతో […]
ప్రధానాంశాలు:
Hair problem can be reduced with Tamarind Tree leaves
Tamarind Tree: చింత చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చింత చిగురు మరియు చింతపండు వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే చింత చిగురు లో కూడా ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. అందుకే పెద్దవాళ్లు చింత చిగురుతో కూడా ఆహారాలు తయారు చేసి మరీ మనకు పెడుతూ ఉంటారు. అయితే ఇప్పటికీ కూడా చింత చిగురుతో గ్రామాలలో వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. వీటితో చేసిన వంటలు ఎంతో రుచిగా కూడా ఉంటాయి. అయితే చింత చిగురు అనేది కొన్ని సమస్యలను తగ్గించటంలో కూడా హెల్ప్ చేస్తుంది.
చింత చెట్టు ఆకులను ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఈ తరుణంలో చింత చెట్టు ఆకులతో జుట్టు సమస్యలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ముందుగా కొన్ని చింత చెట్టు ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వీటిని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ లో కొద్దిగా తేనెను మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఇలా ఒక పావు గంట సేపు అలా వదిలేయాలి. తర్వాత శుభ్రమైన నీటితో క్లీన్ చేసుకోవాలి. మీరు ఇలా చేయడం వలన తలపై రక్త ప్రసరణ అనేది బాగా జరిగి కుదుళ్ళు బలపడతాయి. ఇలా వారంలో రెండు సార్లు కనుక చేస్తే మంచి ఫలితం ఉంటుంది…
ఈ చింతచెట్టు ఆకులలో యాంటీ ఇన్ ఫ్లమెంటరీ మరియు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి. ఇవి జుట్టు యొక్క మూలాలను బలంగా తయారు చేయడంలో కూడా హెల్ప్ చేస్తాయి. వీటితో ప్యాక్ చేసుకోవటం వలన జుట్టు చిట్లటం మరియు రాలటం,దురద లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే జుట్టు ఎంతో బలంగా మరియు దృఢంగా కూడా తయారవుతుంది. అంతేకాక పొడవుగా మరియు ఒత్తుగా కూడా మారుతుంది. అలాగే జుట్టు అనేది పట్టుకుచ్చులా తయారవుతుంది…