Hair Tips : ఈ రెండు చిట్కాలు పాటిస్తే మీ జుట్టు భద్రం… ఇలా చేస్తే ఇక నో హెయిర్ ఫాల్
Hair Tips : ఒకప్పుడు ప్రకృతిలో దొరికే శికాయ, కుంకుడు కాయలను పొడి చేసి తలకి పట్టించేవారు. ఇది సహజ సిద్దంగా లభించినది కాబట్టి మంచి జుట్టు వచ్చేది, హెయిర్ ఫాల్ అయ్యేది కాదు. ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ లో అనేక మార్పులు వచ్చాయి. కాలుష్యం, నీటి సమస్య, రకరకాల షాంపులు, హెయిర్ ప్రోడక్ట్స్ కి అలవాటు పడిపోయాం. ఇవి జట్టుకు ఎంతో నష్టం చేసి పొడి బారేలా చేసి చివరికి ఊడిపోతాయి. జట్టుతోనే కొందరికి అందం వస్తుంది. అలాంటి జుట్టు ఊడిపోతే విలవిలలాడిపోతారు. మానసికంగా కుంగిపోతారు. అయితే కొందరికి జీన్స్ వల్ల కూడా జుట్టు రాలిపోతుంటుంది. ఇలాంటి వారి కోసమే జుట్టు రాలి పోకుండా ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..సాధారణంగా జుట్టు రాలిపోవడానికి కారణం రక్త ప్రసరణ జరగకపోవడమే.
దీనికి పరిష్కారం తలకు చక్కటి మసాజ్ చేయడమే. ఈ మాసాజ్ కు ఆర్గానిక్ కొబ్బరి నూనే, ఆముదం నూనే తీసుకోవాలి. కొబ్బరి నూనే రెండు స్ఫూన్లు, ఆముదం నూనే ఒక స్పూన్ తీసుకుని డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడిచేసుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత కాటన్ బాల్స్ తో జుట్టు కుదుళ్లకు పట్టించి మసాజ్ చేయాలి. దీంతో రక్త ప్రసరణ మెరుగై జుట్టు రాలడం తగ్గిపోతుంది.బియ్యం కడిగిన నీళ్లల్లో అమినో ఆమ్లాలు, విటమిన్ బి, ఇ, సి విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి జుట్టు పెరగడానికి ఎంతగానో సహకరిస్తాయి. బియ్యం నీళ్లను రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కురులకు పట్టించాలి. అరగంట తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కుంటే శిరోజాలు నల్లగా నిగ నిగలాడతాయి.
Hair Tips : రక్త ప్రసరణ జరిగేలా..
బియ్యం కడిగిన నీళ్లతో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది. జట్టు బిరుసుగా అనిపించినప్పుడు బియ్యం కడిగిన నీళ్లను పట్టించి అరగంట తరువాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.అలాగే నిర్జీవంగా ఉన్న జుట్టు కోసం రెండు కట్టల మెంతి ఆకులు మిక్సిలో వేసిన తర్వాత రసాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. అందులో బాగా పండిన అరటిపండు వేసి మిక్స్ పట్టాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. ఒ గంట తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. దీంతో జుట్టు మెత్తగా తయారవుతుంది. ఇలా రెగ్యూలర్ గా చేస్తే జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. కొత్త జుట్టు కూడా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మరి..