Hair Tips : ఈ ఆయిల్ ని రోజు జుట్టుకి అప్లై చేసుకుంటే జుట్టు ఊడే సమస్య తగ్గడమే కాకుండా ఒత్తుగా కూడా పెరుగుతుంది..!
Hair Tips ; ప్రస్తుతం మనం ఉన్న కాలంలో 100% లో 90% ప్రజలలో జుట్టు రాలే సమస్య తో బాధపడుతున్నారు. అయితే వీటికి ఎన్నో రకాల ఆయిల్స్ ని కొన్నిరకాల షాంపులను వాడినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. అయితే అలాంటివారు ఈ ఆయిల్ ని వాడితే జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది. లవంగాలలో ఉండే ఆయిల్ లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ఆయిల్ ని కూడా జుట్టుకు ఉపయోగిస్తూ ఉంటారు. 2015లో లవంగ నూనె మీద స్పెషల్ పరిశోధన చేశారు. అయితే జుట్టు ఊడకుండా ఉండడానికి, చుండ్రులు తగ్గించడానికి జుట్టు ఎదుగుదలకి ఇది బాగా సహాయపడుతుందని
ఫ్యాకల్టీ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ యూనివర్సిటీ ఆఫ్ సదత్ సిటీ వారు దీనిపై పరిశోధన చేసి సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. అయితే ఈ ఆయిల్ ని ఎలా వాడుకోవాలి అంటే మొదటిది చుండ్రు తగ్గించుకోవాలి. అంటే ఒక స్పూన్ లవంగం నూనె తీసుకొని దానిలో మూడు స్పూన్ల ఈ ఈ యూకలిప్టస్ నూనెను కూడా కలిపి మాడికి అప్లై చేయాలి. అలాగే ఉంచుకుంటే చుండ్రు బాగా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే ఈ లవంగా నూనెలో యాంటీ ఫంగల్, ఆంటీ మైక్రోబెల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉండడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుంది. ఇక రెండవది ముఖ్యంగా జుట్టు ఎదుగుదలకు 10 ml లవంగనూనె, కొబ్బరినూనె రెండు కలిపి రోజు రాసుకునే లాగా ఈ ఆయిల్ ని కూడా రాస్తే జుట్టు బాగా ఎదుగుతుంది.
ఇక మూడవది తలలో దురద తగ్గాలంటే స్పూన్ లవంగనూనె మూడు స్పూన్ల అలివ్ నూనె ను కలిపి మాడికి బాగా అప్లై చేసుకుంటే తలలో దురదలు నుంచి ఉపశమనం కలుగుతుంది. జుట్టు ఊడడం ఆగిపోతుంది. ముఖ్యంగా లవంగాలతో యుసినోల్ అనే కెమికల్ ఎక్కువగా ఉంటుంది. ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కావున చాలామందిలో ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన జుట్టు రాలిపోతూ ఉంటుంది. దాని వలన విడుదలయ్యే బ్యాడ్ హార్మోన్స్ వల్ల మనలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి హెయిర్ రూట్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. కావున ఈ లవంగం నూనెలో ఉండే యూస్నోల్ అనే కెమికల్ తగ్గించి జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది. అందుకే జుట్టు సమస్యలు చాలావరకు తగ్గిపోతూ ఉంటాయి. ఈ ఆయిల్ ను మర్దన చేస్తూ అప్లై చేయడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది.