Categories: HealthNews

Fathers Day 2025 : ప్రతి ఒక్క తండ్రి తమ పిల్లల కోసం కొన్ని పనులు చేస్తారు… అందులో వారికి మనం కొన్నైనా చేయగలమా…?

Fathers Day 2025 : ప్రతిసారి ఫాదర్స్ డే అనే రోజు జరుపుకుంటాము. ఫాదర్స్ డే ని మనందరం కూడా తండ్రి రుణాన్ని తీర్చుకునేందుకు ఆ ఒక్క రోజైనా తన రుణాన్ని తీర్చుకునే అవకాశం తీసుకుందాం.. తండ్రి మనకు ఎన్నో చేస్తాడు. తల్లి వెన్నలాంటి మనసును కలిగి ఉంటుంది. హాయ్ తండ్రి కఠిన చేష్టలు వెనుకున్న వెన్నలాంటి మనసు అర్థం చేసుకునే సరికి మనకి పిల్లలు పుట్టేస్తారు. అంతే, ఫాదర్స్ డే సందర్భంగా నాన్న గురించి ఆయన చేసే త్యాగాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మను మించిన దైవం లేదు అని అంటారు. నాన్నను మించిన పరమాత్ముడు లేడు. ఇది ఎంతమందికి తెలుసు. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల విషయంలో పుట్టినప్పుడు నుంచి అమ్మ నవ మాసాలు మోసి పెంచుతుంది కాబట్టి ఆమె విషయంలో కాస్త ప్రేమ ఎక్కువగానే చూపిస్తారు పిల్లలు. చాలామంది చేసే చిన్న చిన్న తప్పులకి కోప్పడే నాన్నని మాత్రం ఎందుకు ఈయన అసలు అర్థం చేసుకోడు ఎప్పుడూ తనదే రైట్ అంటాడు అని మనం మనసులో సనుగుతూ ఏదో భయానికో భక్తి కో ఆయన ముందు నటిస్తాం. మనం నటిస్తే,మనకంటే మించిన నటుడు తండ్రి. పైకి గంభీరంగా భయం వేసినట్లు కనిపించిన ఆయన లోపల కొండంత ప్రేమ దాచుకొని పైకి మాత్రం ఏమి తెలియనట్లు మనల్ని భయపెడుతూ ఉంటారు. తండ్రి అలా ఉంటేనే మన భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తాము. తండ్రి భయం ఉండాలి. అప్పుడే, మనం ప్రయోజకులం అవుతాం. భవిష్యత్తు బాగుండాలి అనే తాపత్రియంతోనే మనపై కోపాన్ని నటిస్తూ ఉంటారు. మన లైఫ్ లో మనం ఒక స్థాయికి వెళ్లే వరకు మన వెనుక తండ్రి వెన్నుతటుతూ ఉంటాడు. ఆయన ప్రోత్సాహం ఎంతగానో ఉంటుంది. సంపాదించి తెచ్చేది తండ్రి. ఆయన కృషి మన భవిష్యత్తు. పిల్లల కోసం తండ్రి ఒక రోజుని అంకితం చేయాల్సిందే. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా శ్రమిస్తూ ఉంటారు. ఆశ్రమే మన జీవితం.

Fathers Day 2025 : ప్రతి ఒక్క తండ్రి తమ పిల్లల కోసం కొన్ని పనులు చేస్తారు… అందులో వారికి మనం కొన్నైనా చేయగలమా…?

తల్లిదండ్రులు పిల్లల్ని కన్న తర్వాత ఒక మనిషి పెరిగితే ఖర్చులు పెరుగుతాయి అని బాధ పడకుండా తనకి వారసుడు వచ్చాడని ఆనందం కూడా పెరుగుతుంది. కొందరికి ఆడపిల్లలు పుట్టినా కూడా ఆ తండ్రి ఆ పిల్లలపై అమితమైన ప్రేమను పంచుతాడు. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రం ఆడపిల్లలు పుడితే తండ్రులు సంతోషించారు. బిడ్డలు ఎప్పుడైనా తల్లిదండ్రులకి భారం కారు. ఇప్పటి సమాజంలో పిల్లలు పెద్దయినాక వారికి పెళ్లిళ్లు అయి భార్యలు వచ్చాక తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నారు. వారి రుణం కోకపోగా వారికి అనేక కష్టాలకు గురి చేస్తున్నారు. ఒక తండ్రి పిల్లవాడు పుట్టిన దగ్గరనుంచి తన కయ్యే ఖర్చు , అతిధి కూడా ఆనందంగా తీసుకుంటాడు. పిల్లల ఎదుగుదల తనకి ఆనందాన్ని ఇస్తుంది. తన పిల్లలకు ఏదైనా ఇవ్వాలని, తనకు మాత్రం ఏదీ ఉంచుకోకుండా అంతా ఇచ్చేస్తాడు. వారు ఏం సంపాదించినా, ఏం చేసినా అంతా పిల్లల కోసమే. మన చదువుల కోసం ఎంతో ఖర్చు పెడతాడు. ఆరోజు తండ్రి తన సంపాదన ఖర్చుపెట్టి మనల్ని చదివించకపోతే మనం ప్రయోజకులం అవ్వనే అవ్వం. కొందరు తల్లిదండ్రులు ఎక్కడికైనా పిల్లని తీసుకెళ్లినప్పుడు మనం చూడలేని ఎన్నో దృశ్యాలను ఆయన భుజాలపై ఉంచుకొని మరి ఆనందించే పిల్లలు చాలానే ఉన్నారు. పెద్దయిన తర్వాత ఎన్ని కొత్త కొత్త ప్లేస్ లు తిరిగి మరెన్నో సుందర దృశ్యాలు చూసిన అప్పటి ఆనందం రాని రాదు. తనంలో ఆయన ఇచ్చిన అండ అలాంటివి. భుజాలపై ఎక్కి కూర్చుని ప్రపంచాన్ని చూసేవాడు రాజులా, ఒక రాణిలా మారిన ఫీలింగ్ ఇచ్చిన కిక్ మళ్లీ మనకు వస్తుందా..

రోజుల్లో పిల్లలకు స్కూల్లో చదివించాలంటే తనకు మించిన భారంల ఫీజులు పెరిగాయి. తమ పిల్లల్ని ఎలాగైనా చదివించాలని తను ఎంతో కష్టపడి ఆ డబ్బులు తెచ్చి స్కూల్లో చదివిస్తున్నారు. చెమటోర్చిన ధనమే మనకు స్కూల్ ఫీజు. ఆరోజుల్లో తమ స్తోమతను బట్టి ప్రభుత్వ పాఠశాలలో వేసి అదనపు ఖర్చులు అదనమేగా వాటన్నిటి కోసం తన అవసరాలని పక్కనపెట్టి ఇవి తర్వాతనే కొనుక్కోవచ్చులే ముందు పిల్లల భవిష్యత్తు ముఖ్యం అని ఆలోచిస్తారు.వారి జీవితమంతా పిల్లలకే ధారపోస్తారు. వారు సుక పడే సమయానికి మనం వారి మాట వినడం. కొందరైతే పిల్లలు పెద్దయి ప్రయోజకులైన తరువాత పెళ్లిళ్లు చేసుకొని తండ్రిని దూషిస్తూ ఉంటారు.నువ్వు మాకేం చేశావు నువ్వేమీ సంపాదించలేదు అంటూ కూడా బాధ పెడుతుంటారు.వారు పస్తులుండి, ఏమీ లేకపోయినా వారు తినకుండా మనకి పెట్టి మన కడుపు నింపుతారు. ఉదయం లేచి మనల్ని లేపి చదివించే దగ్గర నుంచి పిల్లల్ని సెంటర్ దగ్గరికి తీసుకెళ్లే వరకు జాగ్రత్తలు చెప్పి పరీక్షలు రాయిస్తుంటారు. పరీక్ష మూడు గంటలు ఉంటే ఆ టైంలో ఇంటికి వెళ్ళకుండా అక్కడే సెంటర్ దగ్గర పడి కాపులు కాసే నాణలిందరో. ఆడపిల్లల తండ్రులైతే మరో అడుగు ముందే ఎక్కడ తన కూతురికి ఏ ఇబ్బంది వస్తుందో అని కంటిమీద కొలుపు లేకుండా ఇంటికి చేరేవరకు దగ్గరుండి తీసుకెళ్తారు.

Fathers Day 2025 : ప్రతి ఒక్క తండ్రి తమ పిల్లల కోసం కొన్ని పనులు చేస్తారు… అందులో వారికి మనం కొన్నైనా చేయగలమా…?

ఉద్యోగ వేటలో వెనకడుగు పడుతుంటే మనల్ని చూస్తూనే ఏం కాదు నాన్న ట్రై చెయ్ ఇంకా బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అని మన వెన్ను తడుతూ ఉంటారు. మనకంటే ఎక్కువ ఉద్యోగం రాకపోతే వారే బాధపడతారు. తనకు పెట్టాలని ఆశతో కాదు, పిల్లల భవిష్యత్తు ఎవరిపై ఆధారపడకుండా తన కాళ్లపై తను నిలబడాలి అనే ఒక కోరిక. లైఫ్ లో సెటిల్ కాకపోతే అందరూ తండ్రులు పిల్లలపై కోప్పడుతూ ఉంటారు. అర్థం మనపై కోపం కాదు లైఫ్ లో సెటిల్ కావాలని తాపత్రయం. సముద్రం పైకి చూడడానికి అలలతో అలజడిగా ఉంటుంది. కానీ లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే,తండ్రి పైకి చాలా గంభీరంగా కనిపించినా, లో మాత్రం తన పిల్లలపై ఎంతో ప్రేమతో చాలా ప్రశాంతంగా ఉంటాడు. పుట్టి పెరిగే వరకు మన అన్ని బరువు బాధ్యతలు తన భుజాలపై మోసే వాడే తండ్రి.తను మన చిటికెన వేలు పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. మనం వేసే ఒక ప్రతి అడుగును చూసి తను సంతోషిస్తాడు. పిల్లలు భవిష్యత్తులో ఎదుగుతూ ఉంటే, ఇది చూసి ఆనందంతో మునిగి తేలుతుంటాడు. భవిష్యత్తులో తన పిల్లవాడు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అని కోరుకుంటాడు. కూలి నాలి చేసుకోనైనా సరే పిల్లలను చదివించుకుంటున్నారు. ఎండేనకా, వాన వెనకా కష్టపడి తన రక్తాన్ని చెమట రూపంలో చిమ్మీస్తాడు. వాళ్లు రెక్కలు ముక్కలుగా చేసుకుని మనల్ని చదివిస్తారు. పుట్టిన పసి బిడ్డ నుంచి పెరిగి పెద్దయ్య వరకు, ప్రతిరోజు పడే కష్టం వెనుక మనం వారికి ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. దయచేసి నాన్న ప్రేమని అర్థం చేసుకోండి. మీరు నాన్న ప్రేమను ఎప్పుడూ అర్థం చేసుకుంటారంటే మీరు కూడా నాన్న స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రమే. మన నాన్న ఎన్ని భారాలు మోసిన నాన్న వయసు పెరిగాక కాస్త గుర్తింపు మన కోసం ఆయన చేసిన పనుల్లో కొద్దిగా అయినా మన వంతుగా చేయడమే ఆయనకు ఇచ్చే గౌరవం. ఇంతకుమించి ఏం అవసరం లేదండి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. దయచేసి తండ్రి ప్రేమను అర్థం చేసుకొని,తండ్రికి గౌరవం ఇవ్వండి. ఆయనకు ఇచ్చే మర్యాదే, ఆయన రుణం తీర్చుకునే అవకాశం కలిగినట్లు. తల్లిదండ్రులను చూసుకున్న వారికి భవిష్యత్తు చాలా బాగుంటుంది. వారికి అన్నింట్లో విజయాలే. హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ.

Recent Posts

AI Edge Gallery | ఇంటర్నెట్‌ లేకున్నా ఏఐతో పనిచేసే గూగుల్ కొత్త యాప్ ఏంటో తెలుసా?

AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్‌ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్‌…

4 hours ago

Kalisundam Raa | ‘కలిసుందాం రా’ చిత్రాన్ని ఆ హీరో అలా ఎలా మిస్ చేసుకున్నాడు.. 24 ఏళ్ల తర్వాత మళ్లీ చర్చలోకి!

Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…

5 hours ago

TG Govt | ఇందిరమ్మ ఇళ్లకు భారీ ఊరట .. నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానం

TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…

9 hours ago

Accenture | విశాఖకు రానున్న అంతర్జాతీయ ఐటీ దిగ్గజం .. 12 వేల మందికి ఉద్యోగాలు

Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్క‌డ‌ భారీ…

9 hours ago

Digital Arrest | పహల్గాం ఉగ్రదాడిని కూడా వాడేసుకున్న నేరస్తులు .. 26 లక్షలు కోల్పోయిన వృద్ధుడు

Digital Arrest |  సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…

11 hours ago

Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం త‌న సినిమా ఆపేస్తున్న తేజ సజ్జా.. మెగా ఫ్యాన్స్ ఫిదా

Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…

13 hours ago

Cashew Nuts | జీడిపప్పు ఎక్కువ తింటున్నారా? జాగ్రత్త.. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది!

Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…

14 hours ago

Belly Fat | బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే ఈ ఆహారాలు మానేయండి .. ఇక ర‌మ‌న్నా రాదు..!

Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…

15 hours ago