Nara lokesh : సమయం లేదు మిత్రమా! శరణమా.. న్యాయ సమరమా? జగన్ కు లోకేష్ వార్నింగ్..!
Nara lokesh : ఆంధ్రప్రదేశ్‌లో “తల్లికి వందనం” పథకం చుట్టూ రాజకీయ రగడ నడుస్తుంది. రాష్ట్రంలో 89 లక్షల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, బీపీఎల్ కుటుంబాలందరికీ పథకం వర్తించాలన్న నిబంధన ప్రకారం చాలామందికి నిధులు అందలేదని వైఎస్సార్సీపీ ఆరోపించింది. గత ఏడాది పథకం నిధులు బకాయిలుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం కూడా పలువురిని జాబితాల నుంచి తొలగిస్తూ, వైఎస్సార్సీపీ అనుకూలులను వంచిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆడపిల్లల విషయంలో న్యాయం జరుగడం లేదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nara lokesh : సమయం లేదు మిత్రమా! శరణమా.. న్యాయ సమరమా? జగన్ కు లోకేష్ వార్నింగ్..!
ఈ ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇచ్చే రూ.13వేలలో తన ఖాతాలో రూ.2,000 జమ అయినట్లు వైఎస్సార్సీపీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. “మీ వద్ద ఆధారాలు ఉంటే చూపించండి” అంటూ ఆయన సవాల్ విసిరారు. ఒకవేళ ఆధారాలు చూపించలేకపోతే వైఎస్సార్సీపీ నాయకులు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే తాను న్యాయపోరాటం చేస్తానని లోకేష్ స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలపై ఇక మౌనంగా ఉండే ప్రసక్తే లేదని అన్నారు.
ఈ వివాదంలో సోషల్ మీడియా కూడా వేడెక్కింది. “తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వచ్చాయని చెప్పిన మీ ఆరోపణకు ఏ ఆధారమూ లేదు, అందుకే మీకు ఫేక్ జగన్!” పేరు పెడుతున్న అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. “బురద చల్లడం, విమర్శలు చేసి పారిపోయి ప్యాలెస్ లో దాక్కోవడం జగన్ గారికి అలవాటు” అంటూ మరో ట్వీట్ చేశారు. “సమయం లేదు మిత్రమా – శరణమా? న్యాయ సమరమా? తేల్చుకోండి” అంటూ చివర్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై ఇక లీగల్ యాక్షన్ తప్పదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
This website uses cookies.