TEA : పరిగడుపున టీ తాగుతున్నారా.. ఈ డేంజర్ న్యూస్ మీకోసమే!
TEA : చాయ్ తాగని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. చాలా మంది టీ అనగానే పడి చచ్చిపోతారు. ఆహారం తీసుకున్నా లేకపోయినా గంటగంటకు చాయ్ మాత్రం తాగుతుంటారు. కారణం ఒత్తిడి నుంచి వారిని బయటపడవేస్తుందని వారి నమ్మకం. అంతేకాకుండా తమను రిఫ్రెష్‌గా ఉంచుతుందని కొందరు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. ఉదయం లేవగానే హాట్ హాట్‌గా కప్పు చాయ్ తాగుతారు. ఊరు మారినా, ప్లేస్ మారినా అన్ని చోట్లా చాయ్ స్టాల్స్ మాత్రం దర్శనం ఇస్తూనే ఉంటాయి. అందుకే చాలా మంది చాయ్ కొట్టు వద్ద పొగపీలుస్తూ చాయ్‌ను ఆస్వాదిస్తుంటారు. ఉదయం.. సాయంత్రం టీ లేకుండా ఎవరు ఉండలేరు. అయితే,చాయ్ తాగితే ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయట..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుందని, బాడీ ఉత్సాహంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. నిజానికి పూర్తిగా ఇది అవాస్తవం. ఉదయాన్నే టీ తాగడం వలన రోజంతా అలసటగా ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడి.. చిరాకును కలిగిస్తుంది. అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన వికారంగా ఉంటుంది. నరాల సమస్య మొదలవుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వలన పొట్టలో ఉండే మంచి బాక్టీరియా దెబ్బతింటుంది.
TEA : ఏమీ తినకుండా టీ తాగితే ఏమవుతుంది
దీంతో జీర్ణ వ్యవస్థపై అధిక ప్రభావం చూపుతుంది. అధిక వేడిమి బాడీ నుంచి రిలీజ్ అవుతుంది. టీ అధికంగా తాగితే ఆకలి వేయదు. ఫలితంగా ఆల్సర్ లేదా బరువు తగ్గిపోతారు. కాబట్టి ఉదయాన్నే టీ తాగడం మానుకోవాలి.ఉదయాన్నే టీ తాగడం వలన యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది. శరీరంలో నీరు లేకపోవడం.. డీహైడ్రేషన్ సమస్య కలగడం జరుగుతుంది. వీటన్నింటితోపాటు.. ఉదయం ఖాళీ కడపుతో టీ తాగడం వలన ఎసిడిటీ, నోటి దుర్వాసన కూడా కలుగుతాయి. కాబట్టి ఖాళీ కడుపుతో టీ అస్సలు తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.