TEA : టీ తాగితే ఎన్ని నష్టాలో తెలుసా…?
TEA : మన భారతీయులకు కాఫీ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కాఫీని తాగుతారు. కాఫీ తాగకపోతే ఆ రోజంతా ఎలానో ఉంటుంది అని చాలామంది అంటుంటారు. అంతలా కాఫీ తాగటం అలవాటైపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లదాక అందరూ కాపీని ఇష్టపడతారు. కాఫీ తాగటం ఒక రోజు వారి అలవాటుగా మారిపోయింది. దాని వాసనను పసిగట్టే అంతలా కాఫీకి అలవాటు పడిపోయారు. అయితే చాలామంది రోజుకి పరిమితికి మించి కాపీని తాగుతారు. ఇలా త్రాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువగా కాఫీ త్రాగడం వలన శరీరంలోని అనవసరపు కొవ్వు పై కొంతవరకు ప్రభావం చూపిస్తుంది. అలాగే కాఫీని ఎక్కువగా త్రాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… కొంతమంది రన్నర్లు పరుగు పందానికి ముందు చాలా ఎక్కువగా కాఫీని తాగుతూ ఉంటారు.అయితే ఇలా ఎక్కువగా కాఫీ త్రాగడం వలన గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీనివలన గుండె స్పందన లో,లయలో తేడాలు వస్తాయి. గుండె చాలా ఎక్కువగా ఉత్తేజం చెందడం వలన మెదడు కూడా త్వరగా అలసిపోతుంది. కాఫీ ని ఎక్కువగా తాగడం వలన దీర్ఘకాలంలో చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే కొవ్వు తగ్గించుకోవడానికి కాఫీ ఎక్కువగా తాగకూడదు. ఇలా తాగడం వలన అనవసరపు కొవ్వుపై ప్రభావం చూపిస్తుంది. మీరు కాఫీ తాగకుండా ఉండలేకపోతే టీ ని తాగడం మంచిది. కాఫీ కన్నా టీ ను తాగడం మంచిదని చెప్పాలి.
టీ లో థయానిక్ అనే అమైనో యాసిడ్ (గ్లుటామిక్ యాసిడ్ అనలాగ్) అనేది ఉంటుంది. దీనివలన టీ తాగితే మన శరీరానికి మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. అలాగని టీ లో ఎక్కువ పంచదార, పాలు పోయకూడదు. పంచదార, పాలు శాతాన్ని తగ్గిస్తే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. కొందరు టీ కన్నా కాఫీని ఎక్కువగా ఇష్టపడుతారు. అలాంటివారు రోజుకి రెండు లేదా మూడు చిన్న కప్పుల కాఫీని తాగడం మంచిది. దీనిని అయినా పరిమితికిగా తీసుకుంటేనే ఆరోగ్యానికి ప్రయోజనాలు కలుగుతాయి. ఏదైనా పరిమితికి మించి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి కాఫీని మరీ ఎక్కువగా తాగకుండా లిమిట్ గా తాగితే మీ ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగదు.