Health Benefits : ఈ రిచ్ ఫ్రూట్ తిన్నారంటే… లివర్ మొత్తం క్లీన్ అయిపోతుంది…
Health Benefits : చిరు వ్యాపారులు ఎక్కువగా రోడ్లమీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అందుకే వారు ఎక్కువగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వ్యాపారాలు చేసే ప్రదేశంలో ఎక్కువగా వాహనాలు తిరుగుతూ ఉంటాయి. వాటి ద్వారా వెలువడే పొగ వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ పొల్యూషన్ వలన ఊపిరితిత్తుల సమస్యలు, గాలి తిత్తుల సమస్యలు, సెలీనియం, శ్లేష్మం తయారవడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే చిరు వ్యాపారులు ఎండలో వ్యాపారం చేయడం వలన శరీరంలో నీరు మొత్తం ఆవిరి అయిపోతుంది. యూరిన్ వస్తే వెళ్లడానికి ఇబ్బంది అని మంచినీళ్లు కూడా ఎక్కువగా తాగరు. రోడ్డు మీద తక్కువ ఖర్చులో వచ్చే ఆహార పదార్థాలతో కడుపు నింపుకోవడం వంటివి చేస్తుంటారు. రోడ్లమీద ఆహారం అమ్మేవాళ్ళు వాటిని బాగా మరిగించి మళ్లీ వినియోగిస్తుంటారు. వీటి వలన క్యాన్సర్, ఫ్యాటీ లివర్, హార్ట్ ప్యాకేజెస్, హార్ట్ ఎటాక్ సమస్యలు వస్తాయి.
చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళల్లో చాలామంది తెలిసి తెలియక ఎక్కువ సంతానాన్ని కంటారు. దీని వలన ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళన, విశ్రాంతి లేకపోవడం ఇలా అన్ని కారణాల వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. కొందరు ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వ్యాపారాలు చేసుకునే వారికి పోషకాహారం చాలా అవసరం. చిరు వ్యాపారులు ఇంటికి వెళ్లేసరికి రాత్రికి పది, పదకొండు అవుతుంది. ఆ సమయంలో ఆహారం తినడం వలన శరీరంలో కొవ్వు అనేది పెరుగుతుంది. అలాగని తినకుండా ఉండకూడదు. ఇలా చేస్తే ఆరోగ్యం ఇంకా క్షీణించే అవకాశం ఉంది. రాత్రి సమయంలో జొన్నలు, రాగులు, సజ్జలు లాంటివి కొనుక్కొని వండుకొని తినాలి. వీటితోపాటు ఒక ఆకుకూర కూడా తీసుకోవాలి. తినే ఆహారంలో 60 – 70% అన్నం, 30 -40% కూర ఉండేటట్లు చూసుకోవాలి.
ఉదయం 10, 11 గంటల వరకు నీళ్ల మీదనే ఉండి అప్పుడు భోజనం చేయాలి. మధ్యాహ్నం భోజనంలో అన్నం లేదా చపాతి, పుల్కా ఏదో ఒక రకం ఆకుకూరతో తినాలి. రోజుకి రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. రోజుకు మూడుసార్లు తినాలి అంటే వారికి సమయం కుదరదు. కనుక ఇంకా అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే వీటితో పాటు ప్రతిరోజు జామకాయ లేదా అరటిపండును తప్పనిసరిగా తినాలి. ఇలా తినడం వలన శరీరానికి కావలసిన పోషకాలు తగిన మోతాదులో అందుతాయి. అలాగే రోజు వ్యాపారానికి వెళ్లేటప్పుడు ఒక సంచిలో వాటర్ బాటిల్ పెట్టుకొని వెళ్లి తాగుతూ ఉండాలి. వీధి వ్యాపారాలు చేసేవాళ్లు ఇలా నీళ్లు త్రాగుతూ ఉండటం వలన బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగడం వలన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ కూడా యూరిన్ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి.