Health Benefits : 11 రోజులు తాగితే చాలు.. వందేళ్లు వచ్చినా యంగ్ గా ఉంటారు!
Health Benefits : డయాబెటిస్ వయసుతో సంబంధం లేకుండా మనుషుల ఆరోగ్యం మీద దెబ్బకొడుతున్న మహమ్మారి. షుగర్ వలన అనేక వ్యాధులు దాడి చేస్తుంటాయి. మారిపోయన జీవన శైలి, జీన్స్ ప్రభావంతో యాభై ఏళ్లకు రావాల్సి మధుమేహం పాతికేళ్లకే వస్తుంది. అలాంటి డయాబెటిస్ ను తగ్గించే అద్భుతమైన డ్రింక్ గురించి తెలుసుకోండి. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి కొంచెం మరిగాక అందులో స్పూన్ మెంతులు వెయ్యాలి. మెంతుల్లో 50 శాతం ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. మెంతుల్లో విటామిన్లు, మినరల్స్, అధికంగా ఉండే మెంతులు డయాబెటిస్ తో పాటు, ఆర్థరైటిస్, గాయాలు, దద్దుర్లు, మలబద్ధకం, కడుపులో వికారం, గుండెల్లో మంట ఇలాంటి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అయితే పదిహేను నుంచి ఇరవై ఆకుల కరివేపాకులను తీసుకొని శుభ్రంగా కడగాలి.
కరివేపాకులో ఐరన్, విటామిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కరివేపాకు వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.అలాగే జీర్ణ సంబం సమస్యలను కూడా దరి చేరనివ్వదు. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యాన్ని కూడా బాగు చేస్తుంది. అయితే కరివేపాకు చక్కెరను ఎలా అదుపు చేస్తుందంటే దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇధి శరీరంలోని స్టార్చ్ ని గ్లూకోజ్ గా మార్చకుండా చేస్తుంది. దీని ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేయాలి. అల్లంను దంచి లేదా చిన్న ముక్కులుగా కట్ చేయాలి. అల్లం వల్ల కూడా రక్తంలోని చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. అలాగే చిన్న దాల్చిన చెక్క లేదా పావు టీ స్పూన్ పొడిని నీటిలో కలిపి బాగా మరిగించాలి.
ఆ నీరంతా సగం అయ్యే వరకు మరిగించాలి. దాల్చిన చెక్క అనేది డయాబెటిస్ ను అదుపు చేస్తుంది. దాల్చిన చెక్కలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు డయాబెటిస్ వలన వచ్చే రుగ్మతలను, వాపులను తగ్గిస్తుంది.ఈ నీళ్లు గోరు వెచ్చగా అయ్యేలా చేసి నిద్ర లేచిన వెంటనే పరగడుపున తాగాలి. తీపి కోసం ఏమీ వేసుకోకూడదు. తర్వాత అరగంట వరకూ ఏమీ తినకూడదు, తాగకూడదు. అరగంట తర్వాత తినొచ్చు. ఇలా రోజూ తీసుకుంటే బ్లడ్ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. ఇందులోని అన్ని పదార్థాలు ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసే ప్రాంకియాట్రిక్ సెల్స్ ని రెగ్యులేట్ చేస్తాయి. ఈ కషాయం ఎల్డీఎల్ ను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్ డీఎల్ తగ్గి హెచ్డీఎల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు, గుండె పోటు ప్రమాదం కూడా తగ్గుతుంది.