Health Benefits : అన్నం తిన్నప్పటికీ నీరసంగా ఉంటుందా.. అయితే ఇలా చేయాల్సిందే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : అన్నం తిన్నప్పటికీ నీరసంగా ఉంటుందా.. అయితే ఇలా చేయాల్సిందే!

 Authored By pavan | The Telugu News | Updated on :26 April 2022,3:00 pm

Health Benefits : అన్నం తిన్నప్పటికీ.. అప్పుడప్పుడూ నీరసంగా అనిపిస్తోందా.. అలాగే ముఖంపై అకస్మాత్తుగా మొటిమలు రావడం.. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం తరచుగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలను మీరు తరచుగా ఎదుర్కొంటున్నట్లయితే.. మీ అలవాట్లలో చాలా మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని రకాల మూలకాలు శరీరాన్ని అనారోగ్యానికి గురి చేసే ముందు.. మిమ్మ ల్ని మీరు రక్షించుకోండి. ఆరోగ్యకరమైన శరీరాన్ని కల్గి ఉండండి. శరీరంలోని వ్యర్థాలను తొలగించుకోవడానికి సులభమైన మార్గాలను మనం ఇక్కడ తెలుసుకుందాం. దీనిని నిర్విషీకరణ పద్ధతి అంటారు. ఈ ప్రక్రియలో తేలిక పాటి ఆహారాన్ని తినాల్సి ఉంటుంది.

ఇలా చేయడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు. అంతే కాదండోయ్ శరీర శక్తిని కూడా పెంచుతుంది. కొలెస్ట్రాల్ లేదా డయాబెటిస్ వంటి సమస్యలు ఉండే… తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. మీ కొలెస్ట్రాల్, డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది.నమ్మకమైన, కల్తీ లేని ఆహార పదార్థాలకు మాత్రమే మన ప్రాధాన్యం ఇవ్వాలి. కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్లే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఆర్గానిక్ ఉత్పత్తులు వాడండి. అవి వాడలేని వారు కల్తీ లేని ఉత్పత్తులనే నమ్మకం ఉన్న పదార్థాలను వాడండి. అలాగే చక్కెరకు వీలయినంత దూరంగా ఉండాలి. అధికంగా చక్కెర తీసుకోవడం… విషంతో సమానం. కాబట్టి వీలైనంత వరకు చక్కెర వాడకాన్ని తగ్గించుకోవాలి.

Health Benefits if you feel tired then you need to detox how to safely

Health Benefits if you feel tired then you need to detox how to safely

అలాగే తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి. ప్రతిరోజూ దాదాపు 8 నుంచి 12 గ్లాసుల నీటిని తాగేలా ప్లాన్ చేసుకోండి. అలాగే గ్లాసు నిమ్మరసం తాగండ వల్ల కూడా శరీరంలో క్షార పరిమాణాన్ని పెంచుతుంది. నిమ్మరసం అద్భుతమైన డిటాక్స్ డ్రింక్ అని చెబుతుంటారు. అలాగే టీ, కాఫీలకు వీలయినంత దూరంగా ఉండండి. మరీ టీ, కాఫీలు తాగకుండా ఉండలేక పోతే.. రోజుకొకసారి మాత్రమే తాగండి. అలాగే శ్వాస వ్యాయామాలు తప్పుకుండా చేయండి. లోతుగా శ్వాస తీసుకోవడం… మెళ్లిగా వదలడం వంటివి చేయాలి. అంతే కాకుండా మీ శరీరంలో పేరుకుపోయిన కొన్ని రకాల టాక్సిన్లను బయటకు పంపించొచ్చు. ఇవన్నీ పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. నీరసం, మెటిమలు వంటివి మీ దరి చేరవు.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది