Health Benefits : మజ్జిగతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే రోజూ తప్పకుండా ఇష్టపడనివారుండరు
Health Benefits : మజ్జిగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మజ్జిగ సమ్మర్ లో శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉపయోగపడుతుంది. అందుకే మజ్జిగను ఇష్టపడనివారుండరు వేసవిలో పెరుగు నుంచి మజ్జిగ చేసి తాగుతుంటారు. వేసవిలో ఎక్కువగా మజ్జిగ దొరుకుతుంది. ఎండ తాపాన్ని తగ్గించుకోవడానికి అన్ని వయసుల వారు తాగవచ్చు.పెరుగుకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శరీరంలో తేమ శాతం తగ్గిపోకుండా కాపాడుతుంది, ఇమ్యూనిటీని స్ట్రాంగ్‌గా చేస్తుంది. మజ్జిగ జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇండియన్స్ దాదాపు మజ్జిగ లేనిదే భోజనం ముగించరు. మెనోపాజ్ వయసులో ఉన్న ఆడవారికి హాట్ ఫ్లాషెస్ రాకుండా చూస్తుంది. అసిడిటీతో పోరాడుతుంది.
ఎముకలని బలంగా చేస్తుంది. కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. బరువు తగ్గించడంలో సాయం చేస్తుంది. హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.మజ్జిగ జీర్ణక్రియకు, ఎసిడిటీ తగ్గించడానికి, మోషన్స్ తగ్గడానికి, కోలన్ ని శుభ్రం చేయడానికి ఎంతో ఉపయోగపడతుంది. అలాగే వేసవిలో మలబద్ధకం, అసిడిటీ, కడుపు సమస్యలు సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో మజ్జిగను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడం ద్వారా రక్తపోటును యంత్రించడంలో సహాయపడుతుంది.అలాగే మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది.
పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం కూడా తగ్గుతుంది. మజ్జిగకు శొంఠి, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది. మజ్జిగతో అనేక రకాల వంటలను కూడా చేసుకోవచ్చు. ఇండియన్స్ ఎక్కువగా మజ్జిగతో చాలా రకాల రెసిపీలు తయారు చేస్తారు.అయితే మజ్జిగా కొంతమందికి చెడు చేస్తుంది. రాత్రిపూట మాత్రం తీసుకోకూడదు. అలాగే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు కూడా మజ్జిగకు దూరంగా ఉండాలిఉబ్బసం, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధులు ఉన్నవారు మజ్జిగను తీసుకోకపోవడమే మంచింది. అలాగే జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడేవారు మజ్జిగకు దూరంగా ఉండాలి. కిడ్నీల వ్యాధితో బాధపడేవారు కూడా తీసుకోకూడదు. గుండె జబ్బులు ఉన్నవారు కూడా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.