Health Benefits : మ‌ల‌బ‌ద్ద‌కాన్ని ఇలా త‌గ్గించుకోండి.. అయితే ఇలా మాత్రం అస్స‌లు చేయ‌కండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : మ‌ల‌బ‌ద్ద‌కాన్ని ఇలా త‌గ్గించుకోండి.. అయితే ఇలా మాత్రం అస్స‌లు చేయ‌కండి

 Authored By mallesh | The Telugu News | Updated on :4 April 2022,7:00 am

Health Benefits : ప్ర‌స్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం. దీనికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. మారిన జీవన విధానం, టైంకి ఫుడ్ తిన‌క‌పోవ‌డం, వాట‌ర్ ఎక్కువ‌గా తాగ‌క‌పోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం, నిత్యం చిరాకు, కోపం, వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధకం ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారుతోంది. ఈ సమస్యను నివారించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలున్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.మలబద్దకం సమస్యను నేచురల్ గా తగ్గించుకోవడానికి మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో ఫైబర్ ఎక్కువ ఉన్న పండ్లు, కూరగాయ‌ల‌ను చేర్చుకోవాలి. ఇవి మలబద్దక సమస్యను నివారించంచడంలో గొప్ప‌ గా సహాయపడుతాయి.

తిన్న ఆహారం స్మూత్ గా జీర్ణం అయ్యేందుకు మరియు విసర్జనకు సహాయపడుతాయి . ఎక్కువగా ద్రవాలున్న ఆహారాలు మరియు పానీయాలు తీసుకోవడం వల్ల బౌల్ మూమెంట్ కు సహాయపడుతాయి.ఆరోగ్యకర జీవనం కోసం మనిషి రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల మంచి నీటిని తాగాలి. దీని కంటే తక్కువ స్థాయిలో నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తక్కువ అయ్యి డీహైడ్రేషన్ కు గురవుతుంది. అలాంటి సమయంలో శరీరం తనకు కావాల్సిన నీటిని మూత్రం, మలం నుంచి తీసుకుంటుంది. ఫలితంగా మూత్ర సంబంధిత సమస్యలు, మలబద్ధకం వంటివి వస్తుంటాయి.రోజూ మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాల స్థాయి (ఫైబర్) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.

Health Benefits in simple and best home remedy for constipation

Health Benefits in simple and best home remedy for constipation

Health Benefits : వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి..

ఫలితంగా మల బద్ధకం సమస్య ఏర్పడకుండా ఉంటుంది. మంచి నీరు, పళ్ల రసాలను ఎక్కువగా తాగాలి. శరీరానికి కావాల్సిన శ్రమ వ్యాయామం చేయాలి.నువ్వుల నూనె అనేది కాన్ట్సిపేషన్ ను తగ్గించే రెమెడీస్ లో అత్యంత పాపులరైనది. కాబట్టి, దీన్ని డిన్నర్ లో తీసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది. నువ్వుల నూనెలో ఫైబర్ తో పాటు విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. అలాగే ముఖ్యమయిన ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో దొరుకుతాయి. ఒక స్పూన్ ను పిండితో కలుపుకుని తినాలి. మ‌రో చిట్కా ద్వారా కూడా మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారించ‌వ‌చ్చు. ఎండు ద్రాక్ష 50 గ్రా. , సునాముఖి 50 గ్రా. ప‌టిక బెల్లం 50 గ్రా. ఈ మూడింటిని మిక్స్ ప‌ట్టాలి. ప్ర‌తిరోజు రాత్రి ప‌డుకునే ముందు ఈ మిశ్ర‌మాన్ని 5 గ్రా. తీసుకోవాలి. ఉద‌య‌మే ఫ్రీ మోష‌న్ అవుతుంది. మ‌ల బ‌ద్ద‌కం గ్యాస్ ప్రాబ్ల‌మ్స్ ని త‌గ్గించ‌డంలో ఇవి అద్భుతంగా ప‌నిచేస్తాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది