Health Benefits : పసుపు, నిమ్మకాయ కలిపి తీసుకుంటే జరిగేది ఇదే..
Health Benefits : నిమ్మరసంలో, పసుపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడంతో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఈ రెండింటిని కలపడం వల్ల వీటి ఫలితాలు రెట్టింపు అవుతాయి. దీని వల్ల మెదడుకు ఆక్సీకరణను కలిగించే నష్టాన్ని తగ్గిస్తుంది. అల్జీమర్స్ తో కలిగే నష్టాలను సైతం తగ్గిస్తుంది. ఆందోళన, ఒత్తడి, అలసట వంటి వాటిని తగ్గించడంలో ఇది చాలా ఉపయోపడుతుంది. ఆందోళనలను తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగించడంలో చాలా హెల్ప్ చేస్తుంది.
రోగ నిరోదక శక్తిని సైతం పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి, కర్కుమిన్ గాయాలను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. జాయింట్ పెయిన్స్, బాడీలో మంటలను తగ్గిస్తుంది.నిమ్మకాయ, పసుపు కలిపి తీసుకోవడం వల్ల అవి బాడీలోని జీర్ణక్రియను మెడరుపరచడంలో ఇవి సహాయపడతాయి. అధిక కొవ్వును సైతం కరిగించడంలోనూ ఉపయోగపడతాయి. ఒక గ్లాసులో గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. తర్వాత అందులో రెండు టీ స్పూన్ల నిమ్మరసం పోయాలి. దానితో పాటు పావు టీ స్పూన్ పసుపు వేయాలి. తర్వాత దానిని బాగా మిక్స్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఆ నీటిని తాగాలి.
Health Benefits : కొవ్వును కరిగించడంలో..
ఇలా ఉదయం లేదా సాయంత్రం తీసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు చేకూరుతాయి. దీనిని ఎట్టిపరిస్థితుల్లో పడిగడుపున తీసుకోవద్దు. పడిగడుపున తీసుకుంటే కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇలా ప్రతి రోజు తీసుకోవాలి. 15 రోజుల పాటు ఇలా చేస్తే తేడా మీకే తెలుస్తుంది. మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇందులో పోషకాలు అంతలా ఉంటాయి. బాడీకి అవసరమైన పదార్థాలు ఎక్కువ మొత్తంలో అందుతాయి. ఇలాంటివి ఆరోగ్య పరంగా ఎంతో ఉపయోగపడతాయిని చెబుతున్నారు వైద్య నిపుణులు. వీటిని తీసుకునే సందర్భంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.