Health Benefits : నిత్యం గ్రీన్ టీ తీసుకుంటే మీ చిట్టి గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది… ఇంకా ఎన్నో ప్రయోజనాలు…!!
Health Benefits ; చాలామంది టీ కాఫీలు ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. టీ కాఫీల వలన అనేక రకాలైన ఉపయోగాలు ఉంటాయి. అయితే మామూలు టీ కంటే గ్రీన్ టీ తీసుకోవడం వలన ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. గ్రీన్ టీ లో ఉండే గుణాలు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ గ్రీన్ టీ తాగితే బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటిస్తో ఇబ్బంది పడే వారికి మంచి రిజల్ట్ ఉంటుంది. ప్రధానంగా గుండెపోటు సమస్య తగ్గించుకునేందుకు ఈ టీ తప్పక తీసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. అసలు గ్రీన్ టీతో ఆరోగ్యానికి ఎటువంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం…
*మెంటల్ హెల్త్: బిజీ బిజీ లైఫ్ స్టైల్ మూలంగా ప్రశాంతంగా కోల్పోయిన వారికి గ్రీన్ టీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో ఉండే కెఫిన్ మెదడుకు నిరోధక శక్తిని పెంచుతుంది. దాని ఫలితంగా మీ జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఇంకా మీపై ఉండే ఒత్తిడి కూడా తగ్గిస్తుంది..
*క్యాన్సర్ ను తగ్గిస్తుంది: క్యాన్సర్ సమస్యను తగ్గించడానికి నిత్యం గ్రీన్ టీ తాగితే చాలు శరీరంలోని క్యాన్సర్ కణాలను తగ్గించడంలో ఉపయోగపడే పాలి ఫైనల్స్ గ్రీన్ టీ లో పుష్కలంగా ఉంటాయి.
*స్కిన్ ఇన్ఫెక్షన్ కు చెక్: చర్మ సంరక్షణలో కూడా గ్రీన్ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం లోని నిర్జీవ కణాలను సరి చేయడంలో ఉపయోగపడతాయి. అంతేకాదు మొటిమల్ని తగ్గించడానికి కూడా ఈ గ్రీన్ టీ చాలా బాగా సహాయపడుతుంది.
*బ్లడ్ షుగర్ కంట్రోల్: రోజుకి కనీసం రెండు మూడు సార్లు గ్రీన్ టీ తాగడం వలన డయాబెటిస్తో ఇబ్బంది పడేవారిలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. గ్రీన్ టీ లోని క్యాట్ చిన్స్ అనే గుణాలు ఇందుకు ఉపయోగపడతాయి.
*బరువు తగ్గడం: బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను వేగవంతం చేయడమే కాక శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. అలాగే గ్రీన్ టీ తాగిన తర్వాత వ్యాయామం చేస్తే పువ్వు పక్షికరణ పెరుగుతుంది. దీని ఫలితంగా బరువుని కంట్రోల్లో ఉంచుతుంది..