Health Benefits : ఎర్ర తోటకూర తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో ఉన్నాయో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఎర్ర తోటకూర తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో ఉన్నాయో తెలుసా…!

Health Benefits : ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయి. అయితే మనం సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండే తోటకూరను ఎక్కువగా తింటూ ఉంటాం. అయితే ఎర్ర తోటకూర కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది. ఆకు పచ్చ తోటకూర తో పోలిస్తే ఎర్ర తోటకూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కూరలో విటమిన్ ఏ, సి, బి, కాల్షియం పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, కాపర్, జింక్, ఫైబర్, ఫాస్ఫరస్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :15 September 2022,5:00 pm

Health Benefits : ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయి. అయితే మనం సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండే తోటకూరను ఎక్కువగా తింటూ ఉంటాం. అయితే ఎర్ర తోటకూర కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది. ఆకు పచ్చ తోటకూర తో పోలిస్తే ఎర్ర తోటకూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కూరలో విటమిన్ ఏ, సి, బి, కాల్షియం పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, కాపర్, జింక్, ఫైబర్, ఫాస్ఫరస్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వారంలో రెండు సార్లు తోటకూరతో కూర, పప్పు వంటివి చేసుకొని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

తోటకూర తినడం వలన గుండె సంబంధిత సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ ఆకుకూరను ఎక్కువగా తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ ఆకు కూరలో క్యాలరీలు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం వలన బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. అలాగే ఆకు కూరలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన తొందరగా ఆకలి కూడా వేయదు. విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. విటమిన్ కె ఎక్కువగా ఉండడం వలన ఎముకలు గట్టిగా ఉంటాయి.

Health Benefits of asparagus

Health Benefits of asparagus

అలాగే రక్తం గడ్డ కట్టడంలో కీలకపాత్రను పోషిస్తుంది. ఎర్ర తోటకూర తినడం వలన జీవక్రియ రేటు పెరిగి త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అలాగే వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయడమే కాకుండా ముడతలు, మొటిమలు వంటివి లేకుండా ముఖం అందంగా, కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్, జియోక్సంతిన్, లూటిన్ ఉన్నాయి. వీటిలో ఫ్లెవనాయిడ్ పాలీఫెలోనిక్ యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ నుండి ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా చర్మాని కాపాడుతాయి. అలాగే తోటకూరలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. దీనివలన కంటి సమస్యలు రాకుండా చేస్తాయి. ఇన్ని లాభాలు ఉన్న ఎర్ర తోటకూరను వారానికి రెండు సార్లు అయినా కచ్చితంగా తినాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది