Health Benefits : మార్నింగ్ టీకి బదులుగా సొరకాయ జ్యూస్ ఇలా తీసుకోండి… పుష్కలంగా ఆరోగ్య ప్రయోజనాలు…!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: November 3, 2022, 6:30 am

Health Benefits : ప్రతి ఒక్కరు ఉదయం లేవగానే బెడ్ కాపీ నుంచి మొదలుకొని టీలు తాగడం అనేది చాలా సహజం. ఈ విధంగా టీ, కాఫీలు తాగకుండా రోజు ఏ పనిని మొదలుపెట్టారు. టీ తాగితేనే ఏ పనైనా స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా టీ తాగడాన్ని అంతగా అలవాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడున్న జనరేషన్లో టీ ,కాఫీలు అనేవి ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్న సొరకాయ జ్యూస్ ని టీ కి బదులుగా దీనిని తాగడం వలన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి అని తెలియజేస్తున్నారు. సొరకాయ జ్యూస్ మీకు టేస్టీగా అనిపించదు. కానీ ఇది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతినిత్యం ఎక్ససైజ్ చేసుకునేవాళ్లు తప్పక ఈ సొరకాయ జ్యూస్ ని తీసుకోవాలి.

ఇది మీకు చాలా మేలు చేస్తుంది. పాల జ్యూస్ లో సహజ చక్కర కలిగి ఉంటుంది. ఇది గ్లైకోజన్ లెవెల్స్ ను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ సమస్య ఉన్నట్లయితే, మీరు నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు దానికోసం సొరకాయ జ్యూస్ ని తీసుకోవచ్చు. ఖాళీ కడుపుతో సొరకాయ జ్యూస్ తీసుకోవడం వలన శరీరానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సొరకాయ జ్యూస్ లో 98% వాటర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం నుండి విషాన్ని బయటికి పంపిస్తాయి. అదేవిధంగా మలబద్ధకంతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ సొరకాయ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా కిడ్నీలో రాళ్లు యూరినరీ ఇన్ఫెక్షన్స్ మూత్ర సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడేవారు నిత్యము సొరకాయ జ్యూసు త్రాగడం వలన మంచి ఉపయోగం ఉంటుంది.

Health Benefits of Bottle Gourd Juice

Health Benefits of Bottle Gourd Juice

అదేవిధంగా ఎవరైతే నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వాళ్లకి ఈ జ్యూస్ ఆ సమస్యని చెక్ పెట్టడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వలన రక్తంలో చక్కెర లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. అధిక వేడితో బాధపడేవాళ్లు సొరకాయ జ్యూస్తో క్షణాల్లో శరీరం కూల్ అవుతుంది. నిత్యం సొరకాయ జ్యూస్ ని తీసుకోవడం వలన అధిక రక్తపోటు వ్యాధి కూడా అలాగే సొరకాయ జ్యూస్ తో అధిక బరువు కూడా తగ్గుతారు. అలాగే మలబద్ధకం దూరమవుతుంది. జుట్టు తొందరగా తెల్లబడకుండా ఉంటుంది. అదేవిధంగా శరీరానికి ఎంతో శక్తిని కూడా ఇస్తుంది. లివర్ ని శుభ పరుస్తుంది. మలబద్ధకం దూరమవుతుంది. అదేవిధంగా చర్మంపై ముడతలు మచ్చలు, రాకుండా రక్షిస్తుంది. శరీరంలోని వ్యర్ధాలు అన్నిటిని తొలగిస్తుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp